మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఏకైక తెలుగు చిత్రమిదే..

-

సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ స్టాండర్డ్స్ పెంచిన దర్శకుల జాబితాలో మణిరత్నం పేరు ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. డిఫరెంట్ మూవీస్ తీయడంతో పాటు వాటి ద్వారా ప్రజలను ప్రభావితం చేయగల శక్తి మణిరత్నం సినిమాలకు ఉంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్నియన్ సెల్వన్-1’ ఈ నెల 30న విడుదల కానుంది. భారీ తారగణం ఉన్న ఈ చిత్రంపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి..

మణిరత్నం దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని స్టార్ హీరోలందరూ అనుకుంటుంటారు. ఈ సంగతులు అలా పక్కనబెడితే.. దర్శకుడు మణిరత్నం తెలుగులో ఓ సినిమాకు దర్శకత్వం వహించారు. అదే ఆయన ఏకైక తెలుగు సినిమా కావడం విశేషం. ఆ తర్వాత మళ్లీ మణిరత్నం తమిళ్ సినిమాలపైన ఫోకస్ చేశారు.

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఏకైక తెలుగు సినిమా ‘గీతాంజలి’. కాగా, ఇది సూపర్ హిట్ అయింది. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. 1989లో వచ్చిన ఈ సినిమా కు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించారు. నాగార్జునకు జోడీగా ఇందులో గిరిజ నటించింది. ఈ చిత్రం తర్వాత మణిరత్నం మళ్లీ తమిళ్ భాషలోనే సినిమాలు చేశారు.

మణిరత్నం ఆ తర్వాత కాలంలో హిందీలో పలు సినిమాలు చేశారు. కానీ, మళ్లీ తెలుగు సినిమా అయితే చేయలేదు. ప్రజెంట్ ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ ..రామ్ చరణ్ తో తెలుగులో ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ విదితమే.

శంకర్ మాత్రమే కాకుండా పలువురు తమిళ దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు చేస్తున్నారు. తెలుగు దర్శకులు సైతం తమిళ్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. అలా ప్రజెంట్ హెల్దీ ట్రెండ్ రన్ అవుతోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news