ఎన్టీఆర్‌తో అన్ని ఏళ్లు మాట్లాడని హరికృష్ణ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

-

సీనియర్ ఎన్టీఆర్ అంటే ఆయన తనయుడు హరికృష్ణ ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తండ్రి వెన్నంటే ఉండి ఆయనకు కావాల్సిన పనులను దగ్గరుండి చూసుకున్నారు హరికృష్ణ. టీడీపీ పార్టీ పెట్టిన తర్వాత ‘చైతన్య రథం’ డ్రైవర్ గా ఎన్టీఆర్ కు తోడుగా ఉండి ఆయనతో ఎక్కడికంటే అక్కడికి వెళ్లాడు హరి కృష్ణ. తండ్రి అంటే అంత గౌరవం, ప్రేమ ఉన్న హరి కృష్ణ ..దాదాపు రెండేళ్ల పాటు ఆయనతో మాట్లాడకుండా ఉండిపోయారట. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తండ్రి ఎన్టీఆర్ నట వారసత్వాన్ని తనయుడు బాలయ్య తో పాటు హరి కృష్ణ కూడా కొనసాగించారు. హరికృష్ణ హీరోగా చేసిన సినిమాలు తక్కువే. అయినప్పటికీ ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాగా, ఆ తర్వాత కాలంలో హరికృష్ణ..తండ్రి ఎన్టీఆర్ కోసం రాజకీయాల్లోకి వచ్చి ఆయనతోనే ఉండిపోయారు. ఈ సంగతులు పక్కనబెడితే..ఎన్టీఆర్ ముక్కుసూటి మనిషి అని అందరికీ తెలుసు. ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటే కనుక దానికే కట్టుబడి ఉండేవారు.

హరికృష్ణ,,ఫిల్మ్స్ చేస్తున్న కొత్తలో ఓ సారి తన కోసం ఓ సినిమా హాలు కావాలని, అది మీరే నిర్మించాలని తండ్రితో చెప్పారట. అలా చెప్పిన క్రమంలో ఎన్టీఆర్ ఈ విషయమై ఏఎన్ఆర్ ను సలహా కోరగా, స్టూడియో నిర్మిస్తే బాగుంటుందని, హాలుతో పెద్దగా లాభం ఉండబోదని ఆయన అన్నారట. దాంతో తాను హాలు నిర్మించబోనని హరికృష్ణతో ఎన్టీఆర్ చెప్పగా, తన కోసం హాలు నిర్మించలేదని హరికృష్ణ రెండేళ్ల పాటు తండ్రితో మాట్లాడలేదట. కానీ, ఆ తర్వాత కాలంలో ఓ రోజు కోపం తగ్గిన తర్వాత తండ్రి ఎన్టీఆర్ తో మళ్లీ సంభాషణలు కొనసాగించారట.

Read more RELATED
Recommended to you

Latest news