బ్లాక్ బాస్టర్ పిక్చర్ ‘మాస్’ మిస్ చేసుకున్న స్టార్ హీరోలు వీళ్లే..!

కోలీవుడ్ హీరో, డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ లారెన్స్ రాఘవ..మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని అందరికీ తెలుసు. ప్రస్తుతం ‘చంద్రముఖి-2’ చేస్తున్నాడు లారెన్స్. తెలుగులో ‘మాస్’ లాంటి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ కు దర్శకత్వం వహించి సత్తా చాటాడు లారెన్స్. తాను ఒక మాస్ ప్లస్ క్లాస్ డైరెక్టర్ ను అని ఈ మూవీ ద్వారా నిరూపించుకున్నాడు లారెన్స్. అయితే, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునతో ‘మాస్’ సినిమా చేయడాని కంటే ముందర..ఈ స్టోరిని లారెన్స్ ఎంత మందికి వినిపించాడో తెలుసుకుందాం.

స్టైలిష్ ఫిల్మ్ చేయాలనే ఉద్దేశంతో రాఘవ లారెన్స్ ‘మాస్’ స్టోరి రాసుకున్నాడట. అలా ఈ స్టోరిని తొలుత తమిళ్ తలైవా రజనీకాంత్ కు చెప్పాడట.

ఆయన నుంచి ఎలాంటి స్పందన రాని నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవికీ చెప్పాడట. అక్కడ కూడా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.

ఈ క్రమంలోనే కొత్త వాళ్లకు నాగార్జున అవకాశం ఇస్తాడని ఎవరో చెప్పారట. దాంతో లారెన్స్ రాఘవ..‘మాస్’ ఫిల్మ్ స్టోరిని నాగార్జునకు చెప్పాడు. ఇళయ తలపతి విజయ్ కు ఈ సినిమా స్టోరిని చెప్పాలని రాఘవ లారెన్స్ భావించాడట. కానీ, అప్పటికే నాగార్జున స్టోరి ఓకే చేసేశాడు. దాంతో నాగార్జునతో సినిమా చేశాడు.

ఇక ‘మాస్’ మూవీ స్టోరి విన్న నాగార్జున.. చేసేద్దామని చెప్పేశాడు. తానే తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైన ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశాడు. చార్మి, జ్యోతిక ఇందులో హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ సినిమా మేకింగ్ లో రిస్క్ ఉందని నాగార్జున తొలుత భావించారట. కానీ, లారెన్స్ టేకింగ్ చూసి ప్రొసీడ్ అయ్యారట.

mass nagarjuna lawence raghava
mass nagarjuna lawence raghava

ఈ సినిమాతో నాగార్జున బాక్సాఫీసు వద్ద సత్తా చాటాడు. రఘువరన్, ప్రకాశ్ రాజ్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ‘మాస్’ అవతార్ లో నాగార్జున ఇరగదీశాడని, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో నాగార్జున టైమింగ్ జనాలకు బాగా నచ్చింది. ఇక విలన్ కు వార్నింగ్ ఇచ్చే నాగార్జున స్టైల్, డ్యాన్సింగ్ స్టైల్ ఇలా అన్నీ ప్రేక్షకులకు నచ్చేశాయి. ఈ సినిమాతో లారెన్స్ రాఘవ దర్శకుడిగా తన సత్తా ఏంటో చూపించాడు.