మహేశ్‌ బాబుకు శ్రీను వైట్ల తొలుత చెప్పిన కథ ‘దూకుడు’ కాదు.. తెలుసా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘దూకుడు’ ఫిల్మ్ సినీ ప్రియుల ఫేవరెట్ పిక్చర్. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చూసి జనాలు ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో వస్తే చాలు ..టీవీలకు అతుక్కుపోయి మరీ చూసేస్తుంటారు. ఇందులో మహేశ్ కామెడీ టైమింగ్ ప్లస్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ జనాలకు బాగా నచ్చింది.

మహేశ్ బాబు చెప్పే వన్ లైనర్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్సెస్, హీరో-హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అయితే, ఈ సినిమా ద్వారానే శ్రీను వైట్ల తొలిసారి మహేశ్ ను డైరెక్ట్ చేశాడు. కాగా, తొలుత మహేశ్ బాబుకు శ్రీను వైట్ల చెప్పిన స్టోరి ‘దూకుడు’ కాదండోయ్. ఈ సంగతి స్వయంగా డైరెక్టర్ శ్రీను వైట్లయే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

మాస్ మహారాజ రవితేజతో శ్రీను వైట్ల తీసిన ‘వెంకీ’ ఫార్మాట్ లో ఉండే ఓ కామెడీ స్టోరిని తొలుత మహేశ్ బాబుబు శ్రీను వైట్ల చెప్పారు. అయితే, కొద్ది రోజులకు తాను ఆ స్టోరి కాకుండా వేరే స్టోరితో సినిమా తీస్తానని మళ్లీ మహేశ్ కు చెప్పగా, ఆయన కూడా ఓకే అన్నారట. అలా ‘వెంకీ’ ఫార్మాట్ స్టోరి పక్కకు వెళ్లి ‘దూకుడు’ స్టోరి స్టార్ట్ అయింది.

పొలిటీషియన్ గెటప్ లో అప్పటి వరకు మహేశ్ బాబు కనిపించలేదని, దాంతో పీజేఆర్ మాదిరిగా మహేశ్ ను చూపించాలనుకుని ‘దూకుడు’ స్టోరి రెడీ చేసుకున్నట్లు శ్రీను వైట్ల తెలిపారు. ఇక స్టోరి రెడీ అయిపోయి సినిమా విడుదల కాగా అది సెన్సేషనల్ హిట్ అయింది. మహేశ్ -సమంతల రొమాన్స్ తో పాటు ఫైట్స్, ఎమోషన్స్ అన్నీ జనాలకు విపరీతంగా నచ్చాయి. అలా ‘దూకుడు’ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.