పవన్ కళ్యాణ్ కు అంత సత్తా ఉందా..!!

-

పవన్ కళ్యాణ్ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు.తన యాక్టింగ్, స్టైల్ తో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం కొన్ని రోజులు రాజకీయాలలో కొన్ని రోజులు సినిమాలు చేస్తూ వస్తున్నాడు.ఇప్పుడు పవన్ కళ్యాణ్  ”హరిహర వీరమల్లు”. ఈ సినిమా లో నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు.

మరో పక్క హరీశ్ శంకర్ ముందు అనుకున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ వదిలి, తమిళ సినిమా అయిన తెరి ను రీమేక్ కోసం స్క్రిప్ట్ రెడీ చేయమని పవన్ కళ్యాణ్ చెప్పి నట్లు గా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ చేతిలో సుజిత్ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం కూడా ఉంది. ఇక నటుడు సముద్ర ఖని దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం కు కూడా డేట్స్ ఇచ్చాడు. ఇన్ని సినిమాలు చేయడం అంటే పెద్ద పజిల్ లా ఉంది.

ఇలా చూస్తే పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఎవరు ఎంత మొత్తుకున్నా పవన్ కల్యాణ్ ఈ సంవత్సరం మాత్రమే ఖాళీగా ఉంటాడు. వచ్చే సంవత్సరం వేసవి కాలం వరకు రాజకీయాలతో ఫుల్ బిజీ గా మారతాడు. ఎందుకంటే వచ్చే సంవత్సరం ఎలక్షన్స్ లో పవన్ కల్యాణ్ కీ రోల్ ప్లే చేయవలసి ఉంది. అలాగే తనకు ఎలక్షన్స్ కోసం ఖర్చుల కోసం చేతిలో డబ్బులు ఉండవలసిన అవసరం కూడా ఉంది. ఈ నాలుగు ఈ సంవత్సరం లోనే పూర్తి చేయాలని,అందుకే పవన్ కల్యాణ్ ఇన్ని సినిమాలు ఒప్పుకున్నారు అని ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news