కాస్టింగ్ కౌచ్ పై తెలుగు హీరోయిన్..!

-

టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు ఇవ్వరు అన్న టాక్ ఒకప్పుడు ఉండేది అయితే చిన్నగా తెలుగులో వారికి అవకాశాలు వస్తున్నాయి. ఈమధ్య కాలంలో తెలుగు అమ్మాయిగా తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటుంది ఈషా రెబ్బ. అంతకుముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు స్టార్ ఛాన్సులు అందుకునే రేంజ్ కు వెళ్లింది.

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై హీరోయిన్స్ ఎవరు మాట్లాడలేదు కాని ఈషా రెబ్బ మాత్రం టాలీవుడ్ లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పింది. అన్ని రంగాల్లో ఉన్నట్టే ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా రెండు రకాల వ్యక్తులు ఉన్నారు. కాస్టింగ్ కౌచ్ ఇక్కడా ఉంది.. లేదని తాను చెప్పనని క్లారిటీ ఇచ్చింది ఈషా రెబ్బ. అయితే దీన్ని ఎదుర్కొనేందుకు కొన్ని టెక్నిక్స్ తాను ఫాలో అవుతానని చెప్పింది. ఎప్పుడైనా ఇబ్బందిగా అనిపించే పరిస్థితులు మనుషులు ఎదురైతే అక్కడ నుండి తప్పుకుంటానని.. అంతేకాదు పక్కవారికి ఇబ్బంది కలగకుండా నో చెప్పడం నేర్చుకున్నానని చెప్పింది. తనకి అలాంటి అనుభవం ఎదురైంది అంటే తప్పకుండా కాస్టింగ్ కౌచ్ ఉన్నట్టే కదా.. అయితే ఆ విషయాలేవి ప్రస్థావించలేదు ఈషా రెబ్బ.

Read more RELATED
Recommended to you

Latest news