‘యూ టర్న్‌’ ఫేం డైరెక్టర్ తో ఫహాద్ ఫాజిల్ కొత్త సినిమా

మాలీవుడ్ స్టార్ ఫహాజ్ ఫాజిల్ పుష్ప సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఫహాద్ ఇప్పుడు మరో కొత్త మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీలో హీరోహీరోయిన్ కాంబినేషన్, సినిమా టీమ్ నిచూసి ఫహాద్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఎందుకంటే..?

‘కేజీఎఫ్‌’ సిరీస్‌ చిత్రాలతో సినీప్రియుల్ని మెప్పించిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్‌. ‘యూ టర్న్‌’ ఫేమ్‌ పవన్‌ కుమార్‌ దర్శకత్వం. సూరారై పొట్రు ఫేం అపర్ణ బాలమురళి కథానాయిక. పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్. ఈ క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రమే ధూమం. వినూత్నమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా.. ఈనెల 9న సెట్స్‌పైకి వెళ్లనుంది. దీన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌, కన్నడ భాషల్లో వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది చిత్రబృందం.