మహేష్ బాబు తో మొదటి సినిమా.. సక్సెస్ కాని హీరోయిన్లు వీళ్ళే..!!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ప్రతి సంవత్సరం కొంతమంది హీరోయిన్లు తెలుగుతెరకు పరిచయం అవుతుంటారు. వారిలో కొంత మందికి ఏకంగా స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశం ఉంటుంది. అందులో కొంతమంది అనుకున్న విజయం సాధిస్తే మరికొంతమంది సక్సెస్ పొందలేక ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల ద్వారా కూడా కొంతమంది హీరోయిన్లు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. కానీ వారు ఎవరూ కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆశించిన ఫలితాలను పొందే లేకపోవడం గమనార్హం.

1. నమ్రత శిరోద్కర్:


వంశీ సినిమాతో నమ్రతా శిరోద్కర్ కూడా తెలుగు తెరకు మొదటిసారి పరిచయం అయింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటించినా నిజ జీవితంలో ఆయనకు భార్య గా మారిన విషయం తెలిసిందే . కానీ ఈ సినిమా తర్వాత నమ్రత ఎక్కడ సినిమాలలో కనిపించలేదు.

2. బిపాసా బసు – లీసారే:


బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఇద్దరూ కూడా మొదటిసారి టక్కరిదొంగ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. మహేష్ బాబు తో మొదటి సారి నటించిన వీరిద్దరూ కూడా ఆ తర్వాత తెలుగు సినిమాలలో కనిపించలేదు.

3. అమృతా రావు:


అతిధి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. కానీ ఆ తర్వాత ఎక్కువగా హిందీ సినిమాలలో నటించిందే తప్ప తెలుగులో అంతగా రాణించలేక పోయింది.

4. కృతి సనన్:


మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆతర్వాత దోచేయ్ సినిమాలో నటించిన కలిసిరాక ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు మాత్రం రాలేదు . అందుకే బాలీవుడ్ కే పరిమితం అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.

5. కియారా అద్వానీ:


భరత్ అనే నేను సినిమా తో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కియారా ఆ తర్వాత వినయ విధేయ రామ సినిమాలో కూడా బాక్సాఫీస్ దగ్గర కూడా విజయం సాధించలేదు. మరొకసారి రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో నటిస్తోంది . కనీసం ఇప్పటికైనా ఈమెకు కలిసొస్తుందో లేదో తెలియాల్సి ఉంది.