Godfather: సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే..!!

-

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్ ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా నిన్నటి రోజున చాలా గ్రాండ్ గా విడుదల అయ్యింది..మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న లూసీఫర్ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించారు డైరెక్టర్ మోహన్ రాజా. ఈ సినిమా తప్పకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటుందని చిరంజీవి అభిమానులు సైతం భావించారు. ఇక అలాగే సక్సెస్ అయినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా మొదటి రోజు ఏ స్థాయిలో కలెక్షన్లను రాబట్టుకుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1). నైజాం-3.29 కోట్లు
2). సి డెడ్-3.8 కోట్లు
3). ఉత్తరాంధ్ర-1.26 కోట్లు
4). ఈస్ట్ -1.60 కొట్లు
5). వెస్ట్ -59 లక్షలు.
6). గుంటూరు-1.75 కోట్లు.
7) కృష్ణ -73 లక్షలు
8). నెల్లూరు-57 లక్షలు.
మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్లు విషయానికి వస్తే రూ.12.97 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించినట్లుగా సమాచారం ఇక గ్రాస్ పరంగ రూ.21.40 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఒక విధంగా చిరంజీవి స్టార్ హోదాతో పోలిస్తే దసరా సమయంలో గాడ్ ఫాదర్ సినిమా చాలా తక్కువగానే కలెక్షన్ అందుకుందని చెప్పవచ్చు.

వాస్తవానికి ఎక్కువ స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లు వస్తాయని అందరూ భావించారు. అయితే గాడ్ ఫాదర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.38 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. అయితే గత చిత్రాలలో ఆచార్య సినిమా మొదటి రోజే తెలుగు రాష్ట్రాలలో రూ.29 కోట్ల రూపాయలను రాబట్టింది. అలాగే సైరా నరసింహారెడ్డి కూడా రూ.38 కోట్ల రూపాయలు రాబట్టింది.ఇక రీఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 చిత్రం రూ.23 కోట్లు రాబట్టింది. వీటన్నిటికంటే గాడ్ ఫాదర్ సినిమా చాలా తక్కువ కలెక్షన్లనే అందుకుందని. మరి ఈ సినిమా ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news