RRRకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు..ప్రధాని మోదీ ట్వీట్

-

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ‘నాటు నాటు’ పాటకు ప్రతిష్ఠాత్మక పురస్కారం ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అందడం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు యావత్ ఇండియన్ సినిమా సంబురాలు చేసుకుంటోంది. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

అగ్రకథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి ఇదొక చారిత్రక విజయమంటూ.. దీనిపట్ల దేశం గర్విస్తోందన్నారు. అటు ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేశారు.  చాలా ప్రత్యేకమైన సాఫల్యం! అంటూ ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌ టీంకు అభినందనలు తెలిపారు మోడీ. కీరవాణి, ప్రేమ్ రక్షిత్, కాల భైరవ, చంద్రబోస్, రాహుల్సిప్లిగంజ్ లను కూడా అభినందిస్తున్నానంటూ ట్వీట్‌ చేశారు. ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం ప్రతి భారతీయుడిని ఎంతో గర్వించేలా చేసిందన్నారు మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news