దసరా కానుకగా ‘హరిహర వీరమల్లు’ అప్‌డేట్.. పవన్ ఫ్యాన్స్ వెయిటింగ్..

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ప్రజెంట్ పాలిటిక్స్, మూవీస్ రెండూ చేస్తున్నారు. దసరా నుంచి ఏపీ పాలిటిక్స్ లో ఆయన ఇంకా ఫుల్ బిజీ కానున్నారు. మరో వైపున సినిమాలూ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న తొలి పాన్ ఇండియా ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’ అప్ డేట్ కోసం పవన్ అశేష అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తు్న్నారు.

ఓ వైపున సినిమాలు మరో వైపున రాజకీయాలు రెండిటినీ బ్యాలెన్స్ చేయాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘హరి హర వీరమల్లు ’ అప్ డేట్ ను దసరా కానుకగా విడుదల చేయాలని మూవీయూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 2(పవన్ కల్యాన్ బర్త్ డే) రోజున కూ డా డెఫినెట్ గా అప్ డేట్ వస్తుందని పలువురు అభిమానులు అనుకుంటున్నారు.

పవన్ కల్యాణ్ పుట్టిన రోజున పోస్టర్ రిలీజ్ చేస్తారని, దసరా కానుకగా వీడియో విడుదల చేయాలని అనుకుంటున్నట్లు టాక్. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ యాభై శాతం పూర్తయినట్లు సమాచారం.

ఏ.ఎం.రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నఈ పిక్చర్ ను క్రిష్ డైరెక్ట్ చేస్తుండగా, ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం తర్వాత పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ చేయనున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘యథా కాలమ్ తథా వ్యవహారమ్’ పిక్చర్ కూడా చేయనున్నారు. ఈ సినిమాకు వక్కంతం వంశీ స్టోరి అందిస్తు్న్నారు.

Read more RELATED
Recommended to you

Latest news