విజయ్ ఫ్యాన్స్‌కు బిగ్ న్యూస్..‘బీస్ట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్‌డ్..

-

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. ఆయనకు ఉన్న అశేష అభిమానులు ఆయన నటించిన చిత్ర అప్ డేట్ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇటీవల ఆయన నటిస్తున్న ‘బీస్ట్’ చిత్ర అప్ డేట్ ఇవ్వా్ల్సిందింగా డిమాండ్ చేస్తూ #we want beast update అనే హ్యాష్ ట్యాగ్ ను మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు. ఆ ఎఫెక్టో లేదా సినిమా విడుదల తేదీ దగ్గర పడిందనో తెలియదు. కానీ, ‘బీస్ట్’ మూవీ మేకర్స్ ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తుపాకీ’ చిత్రంతో విజయ్ తెలుగు వారికి పరిచయం. కాగా, ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలన్నీ తెలుగులోనూ విడుదలయ్యాయి. ఆయన నటించిన గత చిత్రం ‘మాస్టర్’ తెలుగులో రికార్డు కలెక్షన్స్ చేసింది. ఈ సంగతులు పక్కనబెడితే ‘డాక్టర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బీస్ట్’ ఫిల్మ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ను మేకర్స్ ట్విట్టర్ వేదికగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు.

యాక్షన్ ప్లస్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన మూవీ ట్రైలర్ ను ఉగాది సందర్భంగా వచ్చే నెల 2న విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా పోస్టు చేసిన పోస్టర్ లో ఇళయ దళపతి విజ‌య్‌, టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డేల‌తో పాటు ప‌లువురు న‌టులు గోడ‌చాటు నుంచి అలా తొంగి చూస్తున్నారు.

ఈ చిత్రంలోని పాటలకు మంచి స్పందన వస్తోంది. ‘అరబిక్ కుత్తు, జాల్లీ ఓ జింఖానా’ పాటలను టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ కొరియోగ్రఫీ చేయగా ఆ స్టెప్స్‌కు నెట్టింట చక్కటి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మార‌ణ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. వచ్చే నెల 13న పాన్ ఇండియా వైడ్ గా ఈ చిత్రం ఐదు భాష‌ల్లో రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news