లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితం అయిన సినిమా జీవికి కేంద్రం శుభవార్త చెప్పింది. ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్స్ కి పర్మిషన్స్ ఇవ్వగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా షూట్స్ కి పర్మిషన్ ఇచ్చింది. దేశంలో అన్ని సినిమా, సీరియల్ షూటింగ్స్ కి అనుమతి ఇస్తున్నట్టు కేంద్ర మంత్రి జవదేకర్ ప్రకటించారు.
కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా షూటింగులకు అనుమతి ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. షూటింగ్స్ లో ప్రతి ఒక్కరు మాస్కులు పెట్టుకోవాలని సూచనలు చేశారు. అలానే భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని ఆరోగ్యసేతు యాప్ ను ఉపయోగించాలని పేర్కొన్నారు. ఇక అలానే ఇంతకు ముందులాగా షూట్ కి విజిటర్స్ రాకూడదని పేర్కొన్నారు. ఇక మేకప్ వేసే వారు అందరూ తప్పనిసరిగా పీపీఈ కిట్స్ ధరించాలని పేర్కొన్నారు.