నిన్న హీరోయిన్ హన్సిక మోత్వాని పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త సోహైల్ కథారియా ను ప్రేమించిన ఈ ముద్దుగుమ్మ జైపూర్ లోని రాజకోటలో అంగరంగ వైభవంగా వివాహాలు చేసుకుంది. పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో ఈ స్టార్ కపుల్ ఒకటయ్యారు. రెడ్ కలర్ వర్క్ లెహంగాలో హన్సిక , సిల్వర్ వైట్ కలర్ షేర్వానీలో సోహైల్ కలర్ ఫుల్ గా తయారయ్యారు. టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
జైపూర్ లోని 400 ఏళ్ల క్రితం నిర్మించిన రాజ కోటలో ముంబై లేడీ హన్సిక మోత్వాని మ్యారేజ్ సెలబ్రేషన్స్ కోటకే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయని చెప్పవచ్చు. ముందుగా గులాబీలతో అలంకరించిన పల్లకిపై పెళ్లికూతురు అలంకారంలో వివాహ వేదికకు వచ్చిన హన్సిక మెడలో పూలదండ వేసి.. నుదుటున బొట్టు పెట్టి తన భార్యను చేసుకున్నాడు సోహెల్… అటుపై వివాహ వేదిక చుట్టూ అమర్చిన క్రాకర్స్ వెలుగులో నూతన దంపతులు చిరునవ్వులు చిందించారు.
ఇప్పటినుంచి ఈమె వివాహానికి సంబంధించిన ప్రతి వేడుక సోషల్ మీడియాలో ట్రెండీగా మారుతూ వచ్చింది. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలుకొని హల్దీ , సంగీత్, మెహందీ వేడుకల తోపాటు హన్సిక పెళ్లి ముగిసే వరకు రోజుకో పండుగగా జరుపుకుంది. చివరిగా వెడ్డింగ్ ముందు రోజు కూడా సంగీత్ లో హన్సిక, సోహెల్ కలిసి డాన్స్ చేసిన వీడియోలు కూడా బాగా వైరల్ గా మారుతున్నాయి.
Happy Married life dear Hansika🎉🎉 wishing you only happiness in the new phase of your life🎉
Thank you for giving such master blasters with our Jayamravi ❣️
🎥 Engeyum kadhal
🎥Romeo Juliet
🎥Bhogan#HansikaMotwani #JayamRavi pic.twitter.com/6B6RKmT4gp— Dhivya Srinivasan (@dhivi_13) December 4, 2022