Big Boss Non Stop Telugu: బిందు మాధవికి మరో సెలబ్రిటీ మద్దతు..గెలిచేది ఆడపులియే అంటున్న యంగ్ హీరో

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ OTT సీజన్ ఫైనల్ వీక్ లోకి ఎంటరయింది. ప్రజెంట్ హౌజ్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. నటరాజ్ మాస్టర్ లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యాడు. ఈ క్రమంలోనే మిగిలిన కంటెస్టెంట్స్ లో ఎవరు టైటిల్ నెగ్గగలరు? అనే విషయమై బీబీ లవర్స్ చర్చించుకుంటున్నారు.

సోషల్ మీడియా వేదికగా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ‘బిగ్ బాస్’ ఓటీటీ టైటిల్ విన్నర్ బిందు మాధవియే అని ట్విట్వర్ తో పాటు ఇతర మాధ్యమాల్లో ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. బిందు మాధవికే ఓటు వేయాలని ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ విజ్ఞప్తి చేసింది కూడా. తాజాగా మరో యంగ్ హీరో కూడా బిందు మాధవికే మద్దతు తెలిపాడు.

కోలీవుడ్ యంగ్ హీరో హరీశ్ కల్యాణ్ బిందు మాధవికి మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశాడు. ఫైనల్ వీక్ వరకు బిందు మాధవి వచ్చినందుకు తను గర్వంగా ఉందని తెలిపిన యంగ్ హీరో..డెఫినెట్ గా బిందు మాధవి..విన్నర్ గా ఎమర్జ్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. గో గెట్ ఇట్ చాంపియన్ అని ట్వీట్ చేశాడు. అలా ఫైనల్ వీక్ లో బిందు మాధవికి రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news