బాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం.. స్పందించిన హేమమాలిని..!

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో తాజాగా డ్రగ్స్ కోణం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే డ్రగ్స్ కేసులో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి రిమాండ్ లో ఉంది. అలాగే ఆమె తమ్ముడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటికే చాలా మంది పేర్లు బయటకి వస్తున్నాయి. ఇప్పుడు ఈ అంశమే బాలీవుడ్ ని కుదిపేస్తుంది. అయితే తాజాగా.. ఈ అంశంపై సీనియర్ నటి హేమమాలిని స్పందింస్తూ, బాలీవుడ్ ఎప్పటికీ అత్యున్నత స్థాయిలోనే ఉంటుంది.

బాలీవుడ్ అనేది ఒక క్రియేటివ్ ప్రపంచం. అలాంటి బాలీవుడ్ గురించి ప్రజలు చెడుగా మాట్లాడుకోవడం బాధగా ఉంది. బాలీవుడ్ మీద పడిన మచ్చ కూడా కొన్ని రోజులకు పోతుంది అని అన్నారు. ఇకపోతే తాజాగా ఈ అంశంపై లోక్ సభలో రవికిషన్, రాజ్యసభలో జయాబచ్చన్ వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే.