గూస్ బంప్స్ తెప్పిస్తున్న నాని దసరా మూవీ ట్రైలర్..

-

నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం దసరా. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలై అందరిని ఆకట్టుకుంటుంది. ఊర మాస్ గా సాగే ట్రైలర్ చూసిన వారందరికీ గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది..

టాలీవుడ్ హీరో నాని తాజాగా నటించిన చిత్రం దసరా. ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ నటిస్తుండగా శ్రీకాంత్ ఓడల దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర బృందం. లక్నో వేదికగా విడుదలైన ఈ ట్రైలర్ ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది. ఇందులో నాని మాస్ లుక్ చూసిన అభిమానులంతా సినిమాపై హైప్స్ పెంచుకోగా.. ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ అన్ని కూడా ఆడియన్స్ ని అలరించి మూవీ పై అంచనాలు మరింతగా పెంచాయి. కాగా ప్రస్తుతం విడుదలైన ఈ ట్రైలర్ మరింత క్రేజ్ పెంచేసింది. ముఖ్యంగా ఇందులో యాక్షన్స్ సన్నివేశాలు అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

కాగా ఈ సినిమాలో నాని పూర్తిగా మాస్ లుక్ లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ యాసలో సాగే డైలాగులతో పాటు నాని నటన సినిమాకి హైలైట్ గా మారినట్టు తెలుస్తోంది. అలాగే ట్రైలర్ చిత్తు చిత్తులా గుమ్మా అంటూ తెలంగాణ బతుకమ్మ పాటతో ప్రారంభం కావడం మరో విశేషం. ట్రైలర్ లో కీర్తి సురేష్ పెళ్లికూతురుగా కనిపించి ఆ తర్వాత ధరణిగా పెట్టి పుట్టావురా నా కొడకా అంటూ ఆమె చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటుంది.

యాక్షన్ సన్నివేశాలతో పాటు నాని మాస్ లుక్, మాటలు ఈ సినిమాకి హైలెట్ కానున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ క్రమంలో ఒక్కొక్కనికి మొల్తాడు కింద గుడాల్‌ రాల్తయ్‌.. బ్యాంచెత్‌ `అని చెప్పడం హైలైట్‌గా నిలిచింది. హీరోయిన్ కీర్తి సురేష్ సైతం ఈ సినిమాలో డి గ్లామర్ గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా రెండు వర్గాల మధ్య గొడవ ప్రధానంగా ఈ సినిమా సాగర్ ఉన్నట్టు కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news