డింపుల్ హయాతి: టాలీవుడ్లో హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా హీరోయిన్ గా దూసుకుపోతున్న భామ డింపుల్ హయాతి. తాజాగా ఈ భామ నటించిన రామబాణం చిత్రం మే 5న విడుదలకు సిద్ధమయింది. ఈ నేపథ్యంలో అభిమానులతో చిట్ చాట్ చేసిన ఈమెకు ఒక అభిమాని గుడి కడతా అంటూ చెప్పగా అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది.
టాలీవుడ్ యాక్టర్ డింపుల్ హయాతి 2017లో విడుదలైన గల్ఫ్ మూవీతో హీరోయిన్ అయ్యారు. అనంతరం అభినేత్రి 2, గద్దలకొండ గణేష్ చిత్రాల్లో నటించారు. ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ అభిమాని మీకు నేను గుడి కట్టాలి అనుకుంటున్నాను ఇటుకలతో కట్టనా.. లేక పాలరాతితో కట్టానా.. అంటూ ప్రశ్నించాడు.. దీంతో నాకు గుడి కట్టే ఆలోచన ఉంటే బంగారంతో గుడి కట్టాలని ఆమె సమాధానం చెప్పారు. దాంతో సదరు అభిమాని మైండ్ బ్లాక్ అయ్యింది. కాగా ఈరోజుల్లో తమ అభిమానం నటులకు గుడి కట్టడం సాధారణమైన విషయం అయిపోయింది. తమిళనాడులో ఇప్పటికే కుష్బూ, నమిత వంటి హీరోయిన్లకు గుడిలు కట్టగా తాజాగా బాపట్ల జిల్లాలో సందీప్ అనే వ్యక్తి తన ఇంటి ప్రాంగణంలో సమంతకు గుడి కట్టించారు.
కాగా ప్రస్తుతం డింపుల్ హయాతి నటించిన రామబాణం మూవీలో గోపీచంద్ హీరోగా నటిస్తున్నారు. శ్రీవాస్ దర్శకుడిగా ఉన్నారు. జగపతిబాబు కీలక రోల్ చేస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై పరిశ్రమలో మంచి అంచనాలు ఉన్నాయి.