సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న రాజుగారిగది సినిమా హీరోయిన్..!!

-

తెలుగు సినీ ప్రేక్షకులకు కనడ హీరోయిన్ ధన్య బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజుగారు గది సినిమాలో కూడా హీరోయిన్గా నటించి బాగానే ఆకట్టుకుంది ఆ తర్వాత మహేష్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించి బాగానే ఆకట్టుకుంది. అలా ఎంతోమంది హీరోల సినిమాల లో ఫ్రెండ్ క్యారెక్టర్లలో నటించి మెప్పించిన ధన్య బాలకృష్ణ వివాహం గురించి పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి.వాటి గురించి తెలుసుకుందాం.

ధన్య బాలకృష్ణ నేను శైలజ, రాజు గారి గది తదితర చిత్రాలలో నటించింది. ఇటీవలే విడుదలైన రెక్కీ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఇదంతా ఇలా ఉండగా తాజాగా ధన్య సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ధన్య బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ ను రెండో వివాహం చేసుకుందని అయితే ఈమె పెళ్లి చేసుకుని దాదాపుగా ఏడాది కావస్తోందనే వార్తలు వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ విషయాన్ని ఇటీవల యశోద సినిమాలో నటించిన నటి కల్పిక గణేష్ తెలియజేసినట్లు సమాచారం.

ధన్య బాలకృష్ణ కోలీవుడ్ డైరెక్టర్ అయిన బాలాజీ మోహన్ ను ఈ ఏడాది జనవరిలో రెండవ వివాహం చేసుకుందని తెలియజేసింది. మొదటి నుంచి ధన్య చెన్నైకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బాలాజీ తో టైం స్పెండ్ చేసేదని కూడా తెలియజేసింది నటి కల్పిక గణేష్.ఆ డైరెక్టర్ కు వివాహమై భార్యకు విడాకులు ఇచ్చాడని.. ధన్య వివాహం చేసుకొని సీక్రెట్ గా కాపురం చేస్తోంది అంటూ పలు సంచలన విషయాలు బయటపెట్టింది నటి కల్పిక గణేష్. అందుకే ఆమె ఎక్కడా బయట కనిపించలేదని కూడా తెలియజేసింది కల్పిక. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news