బ్రేకింగ్ : సైరా రిలీజ్‌ కు హైకోర్ట్ పచ్చజెండా

-

మెగా ఫ్యాన్స్ కు శుభవార్త.. చిరు అభిమానులకు పండగ లాంటి న్యూస్.. రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న సైరా నరసింహారెడ్డి సినిమాకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. హైకోర్టులో ఈ సినిమా రిలీజ్ ఆపాలంటూ వేసిన పిటీషన్ పై ఇవాళ విచారణ ఉండటంతో హైకోర్టు ఏం చెబుతుందో అన్న టెన్షన్ నుంచి మెగా ఫ్యాన్స్ కు రిలీఫ్ లభించింది.

సైరా సినిమా విడుదల ఆపాలంటూ వేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఈ సినిమా విడుదల ఆపలేమంటూ తీర్పు ఇచ్చింది. సైరా చిత్రం విడుదల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది. సైరా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ లో సంతోషం వెల్లివిరుస్తోంది.

తమిళనాడు తెలుగు యువ సంఘం నాయకులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సైరా నరసింహారెడ్డి మొదట బయోపిక్ అని చెప్పారని.. ఇప్పుడు చరిత్ర అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన తరపు న్యాయవాది వాదించారు. అయితే ఇదే సమయంలో కోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది.

సినిమా ను కేవలం వినోద పరంగా చూడాలని హైకోర్టు కామెంట్ చేసింది. చరిత్రను ఉన్నది ఉన్నట్టు ఎవరు చూపించారంటూ హైకోర్టు ప్రశ్నించింది. కల్పిత పాత్రలతో జీవిత చరిత్రలను చూపించడం కొత్తేమీ కాదని హైకోర్టు అభిప్రాయపడింది. గతంలో గాంధీజీ, మొగల్ ల సామ్రాజ్యాన్ని తెరకెక్కించిన చిత్రాలను ఈ సందర్భంగా హైకోర్టు ప్రస్తావించింది.

సినిమాకు అంతిమ తీర్పు ప్రేక్షకులదేనని హైకోర్టు అభిప్రాయపడింది. సినిమా నచ్చేది నచ్చనిది ప్రేక్షకులకు వదిలేయాలని కామెంట్ చేసింది. ఈ సమయంలో తాము సినిమా ను అపలేమని తెలిపింది. ఉన్న ఒక్క అడ్డంకి కూడా తొలగిపోవడంతో మెగా క్యాంప్ లో టెన్షన్ పోయింది.

Read more RELATED
Recommended to you

Latest news