హాలీవుడ్లో దృశ్యం రీమేక్.. తొలి భారతీయ సినిమాగా రికార్డ్

-

భారతీయ సినిమాల్లో క్రైమ్ థ్రిల్లర్ జానర్ అనగానే భాషలకతీతంగా ప్రతి ఒక్కరి మదిలో మెదిలే పేరు దృశ్యం. జీతూ జోసేఫ్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమాలు భారతీయ ప్రేక్షకులను ఫిదా చేశాయి. మొదట మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆ తర్వాత తెలుగు, హిందీ భాషల్లో రీమేక్గా మారి అందరి మన్ననలు అందుకుంది. మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో నటించారు. దృశ్యం పేరుతోనే తెలుగులో వెంకటేశ్, మీనా నటించగా శ్రీప్రియ దర్శకత్వం వహించారు. ఇక హిందీలో అజయ్ దేవగణ్, శ్రియ ప్రధాన పాత్రల్లో కనిపించారు. తమిళ్లో పాపనాశనం పేరుతో, కన్నడలో దృశ్య పేరుతో ఈ సినిమా ఇలా అన్ని భాషల్లో రీమేక్ అయి సక్సెస్ను అందుకుంది.

ఇక తాజాగా దృశ్యం మూవీ సిరీస్ ఓ అరుదైన ఘనత సాధించింది. ఇప్పటికే మలయాళ, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ చిత్రం రీమేక్ విషయంలో తాజాగా మరో రికార్డు క్రియేట్ చేసింది. ఏకంగా ఈ మూవీ హాలీవుడ్లో తెరకెక్కనుంది. అక్కడి నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ఇంగ్లిష్‌, స్పానిష్‌లలో రీమేక్‌ చేయనున్నట్లు అఫీషియల్గా అనౌన్స్ చేసింది. దీంతో హాలీవుడ్‌లో రీమేక్‌ కానున్న ఫస్ట్ ఇండియన్ మూవీగా దృశ్యం నిలిచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version