సమంతను అలా చూసి తట్టుకోలేకపోయాను – శోభిత..!

-

గత కొద్ది రోజులుగా శోభిత ధూళిపాల పేరు బాగా వినిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ యంగ్ హీరో నాగచైతన్య తో డేటింగ్ చేస్తోందనే వార్తలు చాలా జోరుగా వినిపిస్తున్నాయి. ఇక తాజాగా శోభిత చేసిన ఇన్ స్టా పోస్టు ఇప్పుడు నెట్టింట చాలా వైరల్ గా మారింది.. మిస్ ఇండియా కిరీటం అందుకున్న శోభిత ధూళిపాళ్ల హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రాణిస్తోంది.ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్, కోలీవుడ్ అంటూ వరుస సినిమాలు చేస్తూ నటిగా దూసుకుపోతోంది.

ఇక ఈమె వ్యక్తిగత జీవితానికి వస్తే నిత్యం హెడ్ లైన్స్ లో నిలిచే ఈమె గత కొంతకాలంగా డేటింగ్ వార్తలతో హల్చల్ చేస్తోంది. నాగచైతన్య తో డేటింగ్ లో ఉంది అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి తోడు లండన్ లో వీళ్ళిద్దరూ కలిసి డేట్కు వెళ్ళిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.. ఇదిలా ఉండగా తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో శోభిత చేసిన పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. సమంతను పెళ్లి కుమార్తెగా చూసి కన్నీళ్లు ఆగలేదు అంటూ ఈమె పోస్ట్ పెట్టగా అది చూసి నెటిజన్స్ నెట్టింట చాలా రకాల ట్రోల్స్ వైరల్ చేస్తున్నారు. ఇది చూసిన ప్రతి ఒక్కరు సమంతను పెళ్లి కుమార్తెగా చూసి శోభిత ఏడవడం ఏంటి అనే మాటలు వైరల్ అవుతున్నాయి.

తాజాగా శోభిత ఒక పెళ్ళికి హాజరయ్యింది. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిని షేర్ చేస్తూ మెహందీ ఫంక్షన్ లో ఎన్నో కొత్త ముఖాలు ఎంతో ఆశ్చర్యంగా మరింత ఆనందంగా ఒకరినొకరు చూసుకుంటున్నాయి.. నేను మాత్రం ఇంకా రెడీ అవ్వలేదు. నా ప్రాణ స్నేహితురాలు ఇంకా రెడీ అవ్వకుండా నాకు తోడుగా ఉంది. నేను తారాఖన్నా లా మారిపోయి ఏర్పాట్లు అన్ని దగ్గరుండి చూసుకున్నాను. అందుకే నేను రెడీ అవ్వడానికి టైం దొరకలేదు. కానీ పెళ్లి మండపంలో మొదటిసారి సమంతను పెళ్లి కుమార్తెగా చూడగానే నాకు ఏడుపు ఆగలేదు. ఇక్కడ మెహందీ పెట్టడం వీలు కాలేదు కానీ లంచ్ మాత్రం సూపర్ గా ఉంది అంటూ రాసుకుంది. మొత్తానికి అయితే ఆ సమంత హీరోయిన్ కాదు.. ఆమె ఫ్రెండ్ పేరు కూడా సమంత అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version