ఆత్మహత్య చేసుకుందామనుకున్న ఇలియానా..కారణం అది కాదంటూ..

-

తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయని ఓ ఇంటర్వ్యూలో ఇలియానా చెప్పుకొచ్చింది. “దేవదాస్” ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇలియానా డిక్రూజ్.అనంతరం వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసి టాప్ హీరోయిన్ గా ఎదిగింది.తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ భామ అక్కడ సైతం మంచి గుర్తింపు పొందింది.తన సన్నని నడుముతో బీ టౌన్ కుర్రకారు మనసు సైతం దోచేసింది.

 

అయితే కొన్ని కారణాల వల్ల సినిమాలకు దూరమైన ఈ గోవా బ్యూటీ బాగా లావు అయింది.దీంతో ఎంతో మంది నెటిజన్లు ఇల్లీ బేబీని బాడీ షేమింగ్ చేశారు.దీనిపై ఈ తార ఎన్నో సార్లు తన బాధను సైతం వ్యక్తం చేసింది.తాజాగా ఓ సందర్భంలో తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయని ఓ ఇంటర్వ్యూలో ఇలియానా చెప్పుకొచ్చింది. “గతంలో నేను ఓ ఆర్టికల్ ని చదివాను.. అందులో మంచి కంటెంట్ ఏం లేదు..ఎవరు రాశారో నాకు గుర్తులేదు..కానీ అవసరమైన అంశాలను పట్టించుకోకుండా, అనవసరమైన విషయాలను చర్చించారు.అది నాకు నచ్చలేదు.అందులో ఉన్నట్టు నాకు 12 సంవత్సరాల వయసు నుంచే కొన్ని శరీర సమస్యలు ఉన్నాయి.

అందుకే ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ వచ్చాను.కొన్నేళ్ళ క్రితం ఆత్మహత్య చేసుకుందామనుకున్న అందులో ఎటువంటి సందేహం లేదు.అప్పట్లో జీవితంలో జరిగిన కొన్ని విషయాలు మూలంగా డిప్రెషన్ లోకి వెళ్లడం వల్ల అలాంటి ఆలోచనలు వచ్చాయి.అంతే కానీ దానికి కారణం నా శరీరాకృతి కాదు.వీటన్నింటినీ కలుపుతూ ఆ ఆర్టికల్ రాసుకొచ్చారు.అది నాకు చాలా చిరాకు కలిగించింది” అంటూ చెప్పుకొచ్చింది ఇలియానా.

Read more RELATED
Recommended to you

Latest news