ఇండియాలోనే టాప్ రెమ్యూనరేషన్ స్టార్ అల్లు అర్జున్.. ఎన్ని కోట్లు అంటే..!

-

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు అల్లు అర్జున్. ఈ సినిమాతో నార్త్ ఇండియా మొత్తం అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. పుష్ప సినిమా ఆయనకు అంతటికి సాధించి పెట్టింది. క్రైమ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా బాలీవుడ్ అభిమానుల సైతం ఆకట్టుకున్న ఈ సినిమా వందల కోట్లు వసూలు చేసింది. అయితే ఈ సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ పెరిగిపోయిందని రెమ్యూనరేషన్ లో ఇండియాలోనే టాప్ స్టార్ గా మారిపోయారని తెలుస్తోంది.

ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి 360 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేసింది. ముఖ్యంగా బాలీవుడ్లో సైతం అల్లు అర్జున్ క్రేజ్ను అమాంతం పెంచేసింది. అయితే ఈ సినిమా అనంతరం అల్లు అర్జున్ తన రెమ్యూనరేషన్ పెంచేసారని సమాచారం..

50+ Allu Arjun Images, Photos, Pics & HD Wallpapers Download

కాగా అల్లు అర్జున్ పుష్ప సినిమాకి 80 కోట్లు తీసుకున్నారని సమాచారం. ఈ సినిమా ఘన విజయాన్ని అందుకోవటంతో తాజాగా పుష్ప2 సినిమాకి 100 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారంట ఈ హీరో. కాగా ఈ సినిమా అనంతరం అర్జున్ రెడ్డి ఫెమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు 120 కోట్ల రేమ్యునరేషన్ డిమాండ్ చేశారు అంట అల్లు అర్జున్. ఈ సినిమాకి నిర్మాతగా ఉన్న భూషణ్ కుమార్ అల్లు అర్జున్ అడిగినంత ఇవ్వటానికి సిద్ధమైపోయారనీ.. అల్లు అర్జున్ ఈ సినిమాలో నటిస్తే చాలని.. ఎంతైనా ఇవ్వటానికైనా సిద్ధమేనని భావించారని తెలుస్తోంది.. కాగా ఈ విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది. 120 కోట్లు రెమ్యునరేషన్ అల్లు అర్జున్ తీసుకోవడంతో ఇండియాలోనే టాప్ మోస్ట్ హీరోగా మారిపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news