బాలయ్య ‘ఆదిత్య 369’ సినిమా టైటిల్‌లో ‘369’ నెంబర్ మీనింగ్ మీకు తెలుసా?

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలయ్య నటించిన టైమ్ ట్రావెల్ మూవీ ‘ఆదిత్య 369’ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలుసు. తెలుగు సినిమాలో సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన డిఫరెంట్ పిక్చర్ గా ఇది నిలిచింది. ఈ ఫిల్మ్ కు సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు.

టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ‘టైమ్ మిషన్’ ద్వారా ఏళ్లు వెనక్కి వెళ్లి అక్కడ బాలయ్య.. శ్రీకృష్ణ దేవరాయలు, అష్టదిగ్గజాలు అయిన కవులతో జరిపే సంభాషణలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. కాగా, ఈ సినిమా టైటిల్ లో ఉన్న 369 అంటే అర్థమేంటో ఈ స్టోరిలో చూద్దాం. బాలయ్య నటించిన ఈ పిక్చర్ నందమూరి అభిమానుల ఫేవరెట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు.

‘ఆదిత్య 369’ టైటిల్ లో ‘ఆదిత్య’ అనగా సూర్యుడు అని అర్థం అని బాలయ్య ఓ సందర్భంలో తెలిపారు .ఇక ‘369’ నెంబర్ విషయానికొస్తే.. ఈ నెంబర్ పాజిటివిటీకి సంకేతమని తెలుస్తోంది. 3 అంటే మార్పు అని, 6 అంటే ప్రారంభం అని, 9 అంటే విస్తరించడం అని అర్థమట. అలా మార్పును స్టార్ట్ చేయడంతో పాటు విస్తరించడం కోసం ఈ నెంబర్ ను యూజ్ చేస్తారని అలా పెట్టారట.

సంఖ్యా శాస్త్రం ప్రకారం ఈ నెంబర్ ‘369’ చాలా లక్కీ నెంబర్ అని నిపుణులు చెప్తున్నారు. అలా ఈ సినిమాకు టైటిల్ కూడా కలిసొచ్చిందనే అభిప్రాయం ఉంది. బాలయ్య ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ చిత్రం చేస్తున్నారు. ఇందులో బాలయ్యకు జోడీగా శ్రుతిహాసన్ నటిస్తుండగా, ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.