టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ మేక- దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘పెళ్లిసందడి’. చిన్న చిత్రంగా వచ్చిన ఈ పిక్చర్ రికార్డు వసూళ్లు చేసింది. అల్లు అరవింద్, అశ్వనీదత్ కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్స్ గా రవళి, దీప్తి భట్నాగర్ నటించారు. కాగా, ఈ చిత్ర ఓపెనింగ్ కు బాలీవుడ్ స్టార్ హీరో వచ్చారు. ఆయన ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీకాంత్ మేక కెరీర్ లో ఫ్యామిలీ ఫిల్మ్ గా ఈ సినిమా చిరస్థాయిలో నిలిచిపోతుంది. ఇక ఈ సినిమాలోని ఎనిమిది పాటలను కొరియోగ్రాఫర్ లేకుండా దర్శకుడు రాఘవేంద్రరావు కంపోజ్ చేశారు. ఆయనకు ఈ సినిమాలోని పాటలు కొరియోగ్రఫీ చేసినందుకు బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు రావడం విశేషం.
ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించగా, ఇందులోని ప్రతీ పాట సూపర్ హిట్ అయింది. ఇక ఈ చిత్ర ప్రారంభోత్సవానికి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్, స్టార్ హీరో ఆమిర్ ఖాన్ వచ్చారు.
చిత్ర ఓపెనింగ్ షాట్ ఆయన చేతుల మీదుగా జరిగింది. ఈ చిత్రానికి అవార్డుల వర్షం కురిసింది. ఇకపోతే ఈ సినిమా మేకింగ్ కు అప్పట్లో రూ.85 లక్షలు ఖర్చు కాగా, రూ.కోటికిపైగా వసూళ్లు చేయడం విశేషం.
ఈ చిత్రానికి సీక్వెల్ తీస్తే డెఫినెట్ గా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు డైరెక్ట్ చేయాలని ఓ ఇంటర్వ్యూలో హీరో శ్రీకాంత్ హీరోయిన్లు చెప్పారు. కాగా, ఈ చిత్రం ఇప్పటి తరానికి తగ్గట్లు మార్పులు చేసి ‘పెళ్లి సందD’ అనే టైటిల్ తో మళ్లీ తీశారు. ఇందులో హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించగా, హీరోయిన్ గా శ్రీలీల నటించింది. ఈ చిత్రం ద్వారా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు వెండితెరకు నటుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తూనే నటుడిగా నటించారు.