హీరోగా నటించి చిరంజీవి చిత్రంలో చిన్న పాత్ర పోషించిన వ్యక్తి ఇతనే..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్యూటిఫుల్ లవ్ స్టోరి ప్లస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘చూడాలని వుంది’. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణి శర్మ అందించిన మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. కాగా, ఈ చిత్రంలో చిరంజీవి వింటేజ్ లుక్ ప్రేక్షకులకు ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఇందులో చిరంజీవి కామెడీ ప్లస్ యాక్షన్ ఎలిమెంట్స్ మెగా అభిమానులకు బాగా నచ్చాయి.

ఈ చిత్రంలో హీరోగా నటించిన వ్యక్తి జూనియర్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆయన ఎవరో కాదండోయ్.. బ్రహ్మాజీ.. ఇప్పటికీ పలు సినిమాల్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ తో పాటు పలు డిఫరెంట్ పాత్రలు పోషిస్తున్న బ్రహ్మాజీ.. అప్పట్లో హీరోగా నటించాడు. చిరంజీవి ‘చూడాలని వుంది’ చిత్రంలో ఆయన చిన్న పాత్ర పోషించడానికి ముందర.. ఆయన హీరోగా నటించిన ‘సింధూరం’ చిత్రం విడుదలైంది.

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింధూరం’ పిక్చర్ లో బ్రహ్మాజీ లీడ్ హీరోగా నటించాడు. ఆ తర్వాత చిరంజీవి సినిమాలో విలన్ ప్రకాశ్ రాజ్ అసిస్టెంట్ గా ‘సూర్య’గా నటించాడు. ఈ విషయం తెలుసుకుని చిరంజీవి ఆశ్చర్యపోయారు. అదేంటీ బ్రహ్మాజీకి ఇంత చిన్న పాత్ర ఏంటని అడిగారట. అప్పుడు ఈ పాత్ర పోషించడం తనకు ఇష్టమేనని బ్రహ్మాజీ చెప్పారట. అలా ఆ సినిమాలో బ్రహ్మాజీ కీలక పాత్ర పోషించారు.

నటుడు బ్రహ్మాజీ
నటుడు బ్రహ్మాజీ

‘చూడాలని వుంది’ చిత్రంలోని పాటలన్నీ కూడా మ్యూజికల్ హిట్ అయ్యాయి. ‘యమహా నగరి’ అనే ఇంట్రడక్షన్ సాంగ్ తో పాటు ప్రతీ సాంగ్ హైలైట్ అయింది. ఇందులో చిరంజీవికి జోడీగా అంజలా ఝవేరీ, సౌందర్య నటించగా, విలన్ గా ప్రకాశ్ రాజ్ నటించారు. ఈ సినిమాను భారీ నిర్మాత అశ్వనీదత్ తన వైజయంతి మూవీస్ బ్యానర్ పైన ప్రొడ్యూస్ చేశారు.