బాలకృష్ణ తాజాగా హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. మొదటి సీజన్ బాగా సక్సెస్ అవడంతో రెండవ సీజన్ ని కూడా ప్రారంభించారు. అయితే రెండవ సీజన్ కూడా నిన్న పవన్ కళ్యాణ్ రెండవ భాగం ఎపిసోడ్ తో అది కూడా పూర్తయింది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మొదటి సీజన్ , రెండవ సీజన్ ల రేటింగ్లను కంపేర్ చేస్తే మొదటి సీజన్ సక్సెస్ అయినంత.. రెండవ సీజన్ సక్సెస్ కాలేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఒకరకంగా చెప్పాలి అంటే బాలకృష్ణ హోస్టుగా చేసిన అన్ స్టాపబుల్ సీజన్ టు సక్సెస్ కాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ప్రభాస్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ లు మినహాయించి ఏ ఒక్క ఎపిసోడ్ కూడా ప్రేక్షకులను అలరించలేదు. పైగా ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్లను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేయడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మరొకవైపు అక్కినేని అభిమానులు కూడా బాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మరొకపక్క చాలామందిని ఆయన విమర్శిస్తూ ఉండడం ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.
అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి అగ్ర హీరోలను కూడా ఈ సీజన్ కి తీసుకొస్తారని అందరూ అనుకున్నారు. కానీ వారు మాత్రం సీజన్ 2 లో కనిపించలేదు. దీంతో మూడవ సీజన్ వరకు ఎదురు చూసే ఓపిక కూడా తమకు లేదు అన్నట్టుగా తమ అభిప్రాయాల ద్వారా వెల్లడిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే సీజన్ 2 ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయిందని చెప్పడంలో సందేహం లేదు.