జబర్దస్త్ లో కమెడియన్ గా అలరిస్తున్న వారంతా సినిమాల్లో కూడా అవకాశాలను దక్కించుకుంటున్నారు. జబర్దస్త్ టీం అందరు బుల్లితెర మీద తమ కామెడీతో కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఇక ఆ ఫ్లాట్ ఫాం వాడుకుని హీరోలైన వారు ఉన్నారు. జబర్దస్త్ లో కామెడీతో అలరించిన షకలక శంకర్ హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఆ దారిలో చమ్మక్ చంద్ర కూడా వెళ్తున్నాడు.
జబర్దస్త్ మొదటి నుండి తన కామెడీతో అలరిస్తున్న చమ్మక్ చంద్ర అందరి కామెడీ ఒకళా అనిపిస్తే అతను కామెడీ స్కిట్స్ మరోళా ఉంటాయి. ఇక ఇప్పుడు చమ్మక్ చంద్ర హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది. రామసక్కనోళ్లు సినిమాలో చమ్మక చంద్ర లీడ్ రోల్ చేస్తున్నాడు. సతీష్ నిర్మిస్తున్న ఈ సినిమా రాజ్ కార్తికేన్ డైరెక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఓ పక్క బుల్లితెర మీద అలరిస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా తమ సత్తా చాటాలని చూస్తున్న చమ్మక్ చంద్ర కు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.