Janhvi Kapoor : లంగావోణీలో జాన్వీ మెస్మరైజింగ్ లుక్స్

-

బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ మరోసారి ట్రెడిషనల్ ఔట్ఫిట్లో సందడి చేసింది. పింక్ అండ్ రెడ్ కలర్ లంగావోణీలో బాపూబొమ్మలా అదరగొట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా తెలుగు వారు జాన్వీని ఈ ఔట్ఫిట్లో చూసి అచ్చం తన తల్లి అతిలోక సుందరి శ్రీదేవిలాగే కనిపిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు. సో బ్యూటీఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ వావ్ అంటూ హార్ట్ ఎమోజీలతో తమ ప్రేమనంతా కురిపించేస్తున్నారు.

ఇక మార్చి 6వ తేదీన తన పుట్టిన రోజు సందర్భంగా ఈ ట్రెడిషనల్ ఔట్ఫిట్లో జాన్వీ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తన బాయ్ఫ్రెండ్ శిఖర్ పహారియా, ఫ్రెండ్ ఓరీతో కలిసి స్వామికి మొక్కులు చెల్లించుకుంది. ప్రతి ఏడాది తన పుట్టిన రోజున జాన్వీ తిరుమలకు రావడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. జాన్వీతో పాటు తన పిన్ని, సీనియర్ హీరోయిన్ మహేశ్వరి కూడా తిరుమలకు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version