వరల్డ్ ఫేమస్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అందువల్ల ఆయన ఇండియాలో చేయాల్సిన భారీ ఈవెంట్ రద్దయింది. వరల్డ్ టూర్‌లో భాగంగా అక్టోబర్ 18న దిల్లీలోని నెహ్రూ స్టేడియంలో జస్టిన్ బీబర్ భారీ ఈవెంట్ జరగాల్సి ఉంది. కానీ అనారోగ్యం కారణంగా బీబర్ భారత్‌కు రావడం లేదని బుక్ మై షో ప్రకటించింది.
కాగా జస్టి బీబర్ అరుదైన రామ్ సే హంట్ సిండ్రోమ్ (ముఖ పక్షవాతం)తో బాధ పడుతున్నట్లు ఇటీవలే తెలిపాడు. ఈ వ్యాధిలో భాగమే తన ముఖానికి పక్షవాతం వచ్చిందని.. కన్ను కూడా ఆర్పలేనని వివరించాడు. ముఖంలోని కుడి భాగం వైపు నాడి వ్యవస్థ దెబ్బతిన్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం ప్రపంచ టూర్‌లో ఉన్న అతడు ఈ వ్యాధి కారణంగా తన తదుపరి పర్యటలను కొంత కాలం రద్దు చేసుకున్నట్లు చెప్పాడు. పూర్తిగా కోలుకునేంతవరకు ఎటువంటి సంగీత ప్రదర్శనలు ఇవ్వనని చెప్పాడు. దీంతో అతడు భారత్‌కు కూడా రావట్లేదు.
కాగా, ఈ రోగం ఓ వైరస్ ద్వారా వ్యాపిస్తుందని తెలిసింది. ఈ విషయం తెలియడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతడి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అతడి కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.