పెళ్లయిన తర్వాత కూడా అలాంటి పనులకు ఒప్పుకుంటున కాజల్.. నెటిజన్స్ ఫైర్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్ చందమామ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక అతి తక్కువ సమయంలోనే తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్న నటిగా చలామణి అవుతున్న కాజల్ నటనతో.. అందంతో.. ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక మగధీర సినిమాతో మరింత బ్రేక్ వచ్చిందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలను అందుకుంది. ఇక మంచి హోదాలో ఉన్న సమయంలోనే తన చిన్ననాటి మిత్రుడు గౌతమ్ ను వివాహం చేసుకొని వివాహం చేసుకున్న ఏడాదికే ఒక కొడుకుకు జన్మనిచ్చింది.

ఇకపోతే ప్రస్తుతం తన భర్తతో దిగిన ఫోటోలను అలాగే తన కొడుకుకు సంబంధించిన ఫోటోలను కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరింతగా ప్రేక్షక ఆదరణ పొందింది. డెలివరీ తర్వాత ఈమె ముఖంలో పూర్తిస్థాయిలో మార్పులు వచ్చాయని చెప్పవచ్చు. ఇక ఈ క్రమంలోనే తన బాడీ ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టిన కాజల్ అగర్వాల్ వర్కౌట్స్ చేస్తూ మరింతగా అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇకపోతే తాను వర్కౌట్ చేసిన వీడియోలను కూడా పంచుకుంటుంది. ఇదంతా పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మ మళ్ళీ సినిమాలలోకి వస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికే ఒక అవకాశం అందుకున్నట్లు పైగా ఆ సినిమాలో ఐటమ్ గర్ల్ గా కనిపించనున్నట్లు సమాచారం.

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప 2 సినిమాలో స్పెషల్ సాంగ్లో కాజల్ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఇప్పటికే సుకుమార్ కాజల్ ని సంప్రదిస్తున్నట్లు సమాచారం.. ఇక కాజల్ కూడా ఓకే చెప్పినట్లు… మొత్తానికి కాజల్ ఐటెం సాంగ్ లో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అలాగే నెటిజన్స్ పూర్తిస్థాయిలో ఫైర్ అవుతున్నారు. తళ్లైన తర్వాత ఐటమ్ సాంగ్ లో నటించడం ఏంటి అంటూ కూడా ఫైర్ అవుతున్నారు.