కీర్తి సురేష్ నటించిన ఫస్ట్ తెలుగు సినిమా రిలీజ్..!!

మొదటిసారిగా నేను శైలజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ కీర్తి సురేష్.. తెలుగు సినిమాతో అందం అభినయంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోయింది. ఇక డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన మహానటి సినిమాతో ఈమె నేషనల్ అవార్డును కూడా సొంతం చేస్తుంది. ఇక అప్పటినుంచి ఈమె పేరు ఎక్కువగా మహానటి అని పేరుతోనే పిలుస్తూ ఉంటారు. రీసెంట్గా మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట చిత్రంతో మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా కంటే ముందు కీర్తి సురేష్ నటించిన సినిమాలు అన్ని వరుసగా డిజాస్టర్ గా మిగిలాయి.

కీర్తి సురేష్ తెలుగు, తమిళ భాషలలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నది. ఇదంతా ఇలా ఉండగా కీర్తి సురేష్ నేను శైలజ సినిమా కంటే ముందు తెలుగులో ఒక సినిమాలో నటించింది. కీర్తి సురేష్, నవీన్ కృష్ణ జంటగా నటించిన చిత్రం “జానకిరామ్”. ఈ చిత్రాన్ని కొత్త డైరెక్టర్ రాంప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఆ సినిమా విడుదల ఆగిపోవడం జరిగిందట. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా అవుతోందని సమాచారం వాటి గురించి తెలుసుకుందాం.

తాజాగా జానకిరామ్ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు కూడా ఈ సినిమా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించినట్లుగా సమాచారం. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా కీలకమైన పాత్రలో నటించడం జరిగింది. ఈ సినిమా త్వరలోనే విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు నిర్మాతలు తెలియజేశారు.