కే జి ఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయ్యింది హీరోయిన్ శ్రీనిధి శెట్టి. ఇక తన మొదటి చిత్రంతోనే పాన్ ఇండియా హీరోయిన్గా పేరు సంపాదించిన ఈ ముద్దుగుమ్మ కేజిఎఫ్ చిత్రంలో రీనా పాత్రలో ఎంతో అద్భుతంగా నటించింది. ఇక కే జి ఎఫ్ -2 లో కూడా ఎంతో అద్భుతంగా నటించింది శ్రీనిధి శెట్టి. దీంతో వరుస అవకాశాలు వెలువడతాయని అందరూ అనుకున్నారు. కానీ ఈ ముద్దుగుమ్మ రెమ్యూనరేషన్ విషయంలో డిమాండ్ చేయడం వల్ల వచ్చిన అవకాశాలు కాస్త చేజారిపోతున్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక కే జి ఎఫ్ త్రీ సినిమా ఉంటుందని హింట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పట్లో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లేలా కనిపించలేదు. సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తన అందచందాలతో కుర్రకారును సైతం మతులు పోగొట్టేలా చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శ్రీనిధి చూపు అంత ఎక్కువగా టాలీవుడ్ పైనే ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కే జి ఎఫ్ సినిమాలతో ఈమె రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఒక్కో చిత్రానికి పారితోషకంగా రూ.3 కోట్ల రూపాయలు అందుకుంటున్నట్లు సమాచారం.
చివరిగా ఈమె విక్రమ్ తో కలిసి కోబ్రా అనే సినిమాలో నటించింది. మొదట ఈ చిత్రానికి రూ.7 ఏడు కోట్ల రూపాయలు డిమాండ్ చేయగా దీంతో దర్శక నిర్మాతలు వెనుకడుగు వేసినట్లుగా వార్తలు వినిపించాయి. ఇక ఇదంతా ఇలా ఉండగా సోషల్ మీడియాలో ఎప్పుడు గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈమె బికినీ ధరించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది ఈ వీడియోలో శ్రీనిధి చాలా హాట్ గానే ఉందని చెప్పవచ్చు. ఇక ఈ వీడియో చూసిన పలువురు అభిమానుల సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.