బాహుబలి ఫార్ములాతో కె.జి.ఎఫ్

-

కన్నడలో 50 కోట్లు వసూళ్లే గగనం అనుకునే టైం లో 250 కోట్ల వసూళ్లతో బీభత్సం సృష్టించిన సినిమా కె.జి.ఎఫ్. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో కన్నడ స్టార్ యశ్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఊహించిన దాని కన్నా పెద్ద విజయాన్ని అందుకుంది. కేవలం కన్నడలోనే కాదు తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ సినిమా పెద్ద విజయం అందుకుంది. కె.జి.ఎఫ్ కు పోటీగా వచ్చిన షారుఖ్ ఖాన్ జీరో చతికిల పడగా కె.జి.ఎఫ్ మాత్రం బాలీవుడ్ లో భారీ వసూళ్లు తెచ్చింది.

ఇక ఈ వసూళ్లను చూసి చాప్టర్ 2 మీద మరింత ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారట. బాహుబలి 2ని ప్రమోట్ చేసినట్టుగా అన్నిచోట్ల కె.జి.ఎఫ్ చాప్టర్ 2ని ప్రమోట్ చేయాలని చూస్తున్నారట. కన్నడ చరిత్రలో ఇప్పటి వరకు ఉన్న రికార్డులు ఒక లెక్క కె.జి.ఎఫ్ ఒక లెక్క. అలాంటి కె.జి.ఎఫ్ సినిమా బాహుబలి ఫార్ములాతో రెండో భాగం మరింత భారీ తనంతో రాబోతుందని తెలుస్తుంది. అందుకే బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ను ఈ సినిమాలో విలన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నరట. మిగత భాషల నటీనటులను తీసుకునే అవకాశం ఉందని తెలుతుంది. మొత్తానికి బాహుబలి తర్వాత ఆ విధంగా పబ్లిసిటీ వచ్చేలా చేసుకున్న కె.జి.ఎఫ్ సెకండ్ పార్ట్ తో ఇంకెన్ని రికార్డులు కొల్లగొడతాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news