‘ఆచార్య’తో ఆస్తులు అమ్ముకునే స్థితికి కొరటాల శివ..అన్ని కోట్లు రిటర్న్!!

-

తెలుగు చిత్ర సీమలో అపజయం ఎరుగని దర్శకుడిగా ఉన్న కొరటాల శివ..‘ఆచార్య’తో తొలి అపజయం అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామచరణ్ నటించిన ఈ పిక్చర్ భారీ అంచనాల నడుమ విడుదలై అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ చిత్రం వలన కొరటాల శివ ఇమేజ్ డ్యామేజ్ అయింది.

మెగా అభిమానులు సైతం ఈ ఫిల్మ్ చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, ఈ మూవీ వలన డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టం వచ్చింది. ఈ క్రమంలోనే వారిని ఆదుకునేందుకు దర్శకుడు కొరటాల శివ రూ.33 కోట్లు తిరిగి ఇచ్చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. బయ్యర్లకు తిరిగి డబ్బులు ఇచ్చే క్రమంలోనే డైరెక్టర్ తన ఆస్తులు అమ్మేసుకున్నారట. అలా ఫెయిల్యూర్ బాధ్యత తీసుకుని రూ.15 కోట్ల వరకు ఆస్తులమ్మి చెల్లించినట్లు వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది.

 

‘ఆచార్య’ ఫిల్మ్..రిలీజ్ కు ముందర రూ.120 కోట్ల వరకు బిజినెస్ చేసింది. కానీ, విడుదలయ్యాక డిస్ట్రిబ్యూటర్లకు పూడ్చలేనంత నష్టం మిగిల్చింది. సుమారుగా వారికి రూ.80 కోట్ల నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునేందుకు దర్శకుడు కొరటాల శివ, హీరోలు కూడా ముందుకొచ్చి తమ వంతు బాధ్యతగా డబ్బులు తిరిగి ఇచ్చారని టాలీవుడ్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్. కొరటాల శివ ప్రస్తుతం తారక్ తో NTR30 అనే పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news