సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ప్రజెంట్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. NTR 30 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రం తెరకెక్కుతోంది. తారక్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. కాగా, ఇప్పటికే వీరిరువురి కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలుసు. అయితే, ఈ చిత్రంలో ఎన్టీఆర్ జూనియర్..పెదనాన్న పాత్రకు బాలయ్యను తీసుకోవాలని చాలా మంది అనుకున్నారట. కానీ, కొరటాల శివ మాత్రం మోహన్ లాల్ తీసుకున్నారు. అందుకు గల కారణాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ కారణమేమిటంటే…
‘జనతా గ్యారేజ్’ పిక్చర్ తారక్ కెరీర్ లో బెస్ట్ పిక్చర్ అని అభిమానులు చెప్తుంటారు. క్లాస్ ప్లస్ మాస్ ఎలిమెంట్స్ ను సమపాళ్లలో దట్టించి..సమాజానికి సందేశం ఇచ్చిన చిత్రంగా ఇది నిలిచిపోయింది. అయితే, ఇందులో తారక్ పెదనాన్నగా మాలీవుడ్(మలయాళం) కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ను తీసుకోవడమే సబబని కొరటాల శివ చెప్పుకొచ్చారు.
ఒకవేళ ఆ పాత్రలో బాలకృష్ణను తీసుకుంటే కనుక సినీ లవర్స్, నందమూరి అభిమానులు, ప్రేక్షకులు అందరూ..బాబాయి, అబ్బాయిలను మాత్రమే చూస్తారని, స్టోరిని పక్కనబెడతారని చెప్పారు. అందుకే స్టోరిని క్యారీ చేయడంతో పాటు సహజంగానే తారక్ కు పెదనాన్నలాగా కనబడే వ్యక్తిగా మోహన్ లాల్ అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో మోహన్ లాల్ ను తీసుకున్నట్లు వివరించారు. అలా వీరిరువురు (మోహన్ లాల్-తారక్) వెండితెరపైన చక్కటి అభినయం కనబరచగా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
కొరటాల శివ గత చిత్రం ‘ఆచార్య’ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఈ నేపథ్యంలో శివ.. తదుపరి చిత్రం ఎన్టీఆర్ 30పైన ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ మేకర్స్ ఇద్దరూ కలిసి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు.