Lavanya Tripathi: పబ్‌లో గన్స్ పట్టుకుని లావణ్య త్రిపాఠి ‘హ్యాపీ బర్త్ డే’ సెలబ్రేషన్స్!

-

‘అందాల రాక్షసి’ చిత్రంతో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన లావణ్య త్రిపాఠి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఈ సొట్టబుగ్గల సోయగం అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘అందాల రాక్షసి’ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది.

Lavanya Tripathi At Antariksham 9000 kmph pre release event

ఇక ఆ తర్వాత నటించిన ‘భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రాలలో లావణ్య నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే, ఆ తర్వాత కాలంలో ఈ హీరోయిన్ నటించిన ‘దూసుకెళ్తా, శ్రీ రస్తు శుభమస్తు, అర్జున్ సురవరం, ఉన్నది ఒక్కటే జిందగీ’ సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు. అలా ఈ ఈ భామకు కొంత కాలంగా కలిసి రావడం లేదు. గతేడాది వచ్చిన ‘చావు కబురు చల్లగా’ చిత్రం కూడా ప్రేక్షకులను అలరించలేకపోయింది.

ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి రూటు మార్చింది. మోడ్రన్ గర్ల్ గా లీడ్ రోల్ ప్లే చేస్తోంది ఈ సుందరి. ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో ‘హ్యాపీ బర్త్‌డే’ సినిమా చేస్తోంది. యాక్షన్ క్రైమ్ కామెడీ డ్రామాగా రూపొందుతోన్నఈ పిక్చర్ లో నరేశ్ అగస్త్య, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్ టైన్ మెంట్స్ వారు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

మేకర్స్ ఈ ‘‘హ్యాపీ బర్త్ డే’’ పిక్చర్ అప్ డేట్ ఇచ్చేశారు. ఈ ఏడాది జూలై 15న సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పోస్టర్ లో లావణ్య త్రిపాఠి ట్రెండీ కాస్ట్యూమ్ లో డిఫరెంట్ లుక్ లో కనబడుతోంది. ‘నో గన్ నో ఎంట్రీ’ అనే బోర్డ్ ఉన్న పబ్‌లో గన్స్‌తో లావణ్య త్రిపాఠి కనబడుతోంది.ఈ చిత్రంతో పాటు లావణ్య ..‘‘మాయవన్ రీలోడెడ్’’ చిత్రంలోనూ నటిస్తోంది. ఈ ఏడాది నవంబర్ నెలలో ఈ పిక్చర్ రిలీజ్ కానుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news