టీమ్ ఇండియా మాజీ కెప్టెన్.. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని తన సతీమణి సాక్షితో కలిసి ధోనీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బ్యానర్లో ధోని.. తన పుట్టిల్లులా భావించే చెన్నై వాసులకు కానుకగా తన తొలిసినిమాను తమిళంలోనే నిర్మించారు. అలా ఈ బ్యానర్ నుంచి వచ్చిన తొలి చిత్రం ఎల్జీఎం(Lets Get Married). ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో హరీశ్ కల్యాణ్ హీరోగా నటించగా.. లవ్‌టుడే ఫేం ఇవానా హీరోయిన్గా కనిపించింది.
రమేశ్ తమిళ్మని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా జులై 28న విడుదలైన ప్రేక్షకుల్లో మంచి టాక్ సంపాదించుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. సైలెంట్‌గా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ట్విస్ట్ ఏంటంటే.. ఇది కేవలం తమిళ్ వెర్షన్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే తెలుగు ఇంకా ఇతర భాషల్లోకి రానున్నట్లు సమాచారం.