భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్న లైగర్ బ్యూటీ.. అందుకేనా..?

-

ఇటీవల లైగర్ సినిమాతో డిజాస్టర్ ను మూటగట్టుకున్న అనన్య పాండే గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. బాలీవుడ్ బ్యూటీ అయిన ఈ ముద్దుగుమ్మ తాజాగా దేవాలయాలను సందర్శిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది.Ananya Panday Says She Gets Affected by Trolls: I Want to Prove Myself and Want People to Like Me as an Actor ఈమె ఎక్కువగా బాలీవుడ్ లోనే నటిస్తూ ఉంటుంది. సినీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనన్య పాండే ఎవరో కాదు ప్రముఖ నటుడు చుంకి పాండే కుమార్తె. 2019లో టీనేజ్ చిత్రమైన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మరియు కామెడీ చిత్రం పతి పత్ని ఔర్ ఓ అనే చిత్రాలలో తన నటనతో పూర్తిస్థాయిలో ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాదు ఈ సినిమాలలో ఆమె నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రానికి ఉత్తమ మహిళ అరంగేట్రానికి ఫిలింఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత ఖాళీ పీలీ, గేహ్రాయాన్, లైగర్ వంటి సినిమాలలో నటించి మెప్పించింది.  ఇటీవల బాలీవుడ్ లో కాఫీ విత్ కరణ్ షో కి హాజరైన ఈమె ఎన్నో విషయాలను పంచుకోవడమే కాకుండా తన క్రష్ గురించి కూడా వెల్లడించింది. ఇకపోతే ప్రస్తుతం ఈమె సినిమాలు ఏమీ లేకపోవడంతో విహారయాత్రలు చేస్తూ భక్తి పారవస్యంయంలో మునిగి తేలుతోంది. పలు దేవాలయాలను సందర్శించడమే కాకుండా అక్కడ దిగిన ఫోటోలను కూడా అభిమానుల కోసం సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉండటం గమనార్హం.

ఇక అనన్య పాండే తల్లి క్యాస్టింగ్ డిజైనర్. 2017 వరకు ధీరుభాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువు పూర్తి చేసిన ఈమె 2017 లో ప్యారిస్ లో జరిగిన వానిటీ ఫెయిర్ యొక్క లే బాల్ డస్ డెబ్యూ టాంటేస్ ఈవెంట్ లో కూడా పాల్గొనింది ఇకపోతే అనన్య పాండే షేర్ చేసుకున్న ఫోటోలను మీరు కూడా ఒకసారి చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news