లైగర్ మూవీ రివ్యూ..విజయ దేవరకొండ ఆశలపై నీళ్లు చల్లిన పూరి జగన్నాథ్

-

టాలీవుడ్ లో మోస్ట్ హైప్ ఉన్న మూవీస్ లిస్ట్ లో ఒకటిగా నిలిచినా లైగర్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది..ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ దర్శకత్వం వహించాడు..టీజర్, ట్రైలర్ మరియు సాంగ్స్ యావరేజి గా ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా కి ఈ స్థాయి క్రేజ్ రావడానికి కారణం విజయ్ దేవరకొండ అనే చెప్పాలి..యూత్ లో ఆయనకీ ఉన్న విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఈరోజు ఈ సినిమాపై ఇంతలా క్రేజ్ వచ్చేలా చేసింది..అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదిరిపోయాయి..ఇక టాక్ రావడం ఒక్కటే ఆలస్యం..పాన్ ఇండియా లెవెల్ లో విజయ్ దేవరకొండ జెండా పాతేస్తాడు అని అభిమానులు ఆశించారు..కానీ సీన్ రివర్స్ అయ్యింది..మొదటి ఆట నుండే ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ రావడం మూవీ టీం కి పెద్ద షాక్ అని చెప్పొచ్చు..కానీ విడుదలకి ముందు అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగా జరిగాయి కనుక ఈ సినిమా మొదటి రోజు ఓపెనింగ్ చాలా సాలిడ్ గానే వచ్చింది.

కథ:

బయట పబ్లిక్ టాక్ పక్కన పెడితే..ఈ సినిమాకి సంబంధించిన నిజమైన రివ్యూ ని ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము..ముందుగా కథ విషయానికి వస్తే మైక్ టైసన్ మరియు రమ్యకృష్ణ కి పుట్టిన బిడ్డనే ఈ లైగర్ (విజయ్ దేవరకొండ)..మైక్ టైసన్ ని నమ్మి మోసపోయిన రమ్య కృష్ణ ఆ తర్వాత హీరో ని తీసుకొని కరీంనగర్ కి వెళ్ళిపోతుంది..చిన్నప్పటి నుండి బాక్సింగ్ మీద విపరీతమైన ఆసక్తి ఉన్న హీరో పెరిగి పెద్దవాడు అయిన తర్వాత ముంబై కి వెళ్లి బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటాడు..అక్కడ బాగా డబ్బున్న అమ్మాయి అయిన హీరోయిన్ అనన్య పాండే తో ప్రేమలో పడుతాడు..అలా సాగిపోతున్న హీరో జీవితం లోకి అతని తండ్రి మైక్ టైసన్ మళ్ళీ వస్తాడు..అతడు వచ్చిన తర్వాత హీరో కి ఎలాంటి ఇబ్బందులు ఎదురు అయ్యాయి..వాటిని హీరో ఎలా ఎదురుకున్నాడు అనేదే స్టోరీ..ఇదే స్టోరీ ని మనం ఇది వరుకు ఎన్నో సార్లు చూసి ఉంటాము..కానీ టేకింగ్ మరియు స్క్రీన్ ప్లే విషయం లో పూరి జగన్నాథ్ కాస్త శ్రద్ద పెట్టి ఉంటె కచ్చితంగా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది.

విశ్లేషణ :

ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ విజయ్ దేవరకొండ ఒక్కడే..అతని స్క్రీన్ ప్రెజన్స్ వల్లే సీట్స్ లో కూర్చోగలుగుతారు ఆడియన్స్..యాక్టింగ్ కి చాలా బాగా చెయ్యడానికి ట్రై చేసాడు కానీ నత్తి రోల్ ని సరిగా క్యారీ చెయ్యలేకపోయాడు..ఆడియన్స్ కి చిరాకు వచ్చింది..ఇక హీరోయిన్ అనన్య పాండే సంగతి సరేసరి..సినిమాకి అతి పెద్ద మైనస్ ఈమెనే..ఇక రమ్య కృష్ణ గారిది బాగా ఓవర్ యాక్టింగ్ లాగ అనిపిస్తాది..ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాని మైక్ టైసన్ వంటి ప్రఖ్యాత బాక్సింగ్ ఛాంపియన్ ఎలా ఒప్పుకున్నాడో అర్థం కావట్లేదు..పూరి జగన్నాథ్ ఈయనని కలవడానికి ఒకటిన్నర సంవత్సరాలు సమయం తీసుకున్నాడు అట..అంత సమయం తీసుకొని ఇంత చెత్త పాత్ర ఎలా డిసైన్ చేసాడో అని చూసే ప్రతి ప్రేక్షకుడికి అనిపిస్తుంది..ఇక ఏ సినిమాకి ప్రాణం పోసేది మ్యూజిక్..కంటెంట్ లేని సన్నివేశం ని కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో వేరే లెవెల్ కి తీసుకెళ్ళచ్చు..కానీ ఈ సినిమాలో ఒకటి రెండు పాటలు పర్వాలేదు అని అనిపించినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయం లో మాత్రం పూర్తి గా చేతులు ఎత్తేసాడు ఆ చిత్ర సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్..ఇలా ఒక్క విజయ్ దేవరకొండ తప్ప ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఈ సినిమా పరంగా ఫెయిల్ అయ్యింది..ఉన్న హైప్ కి బాగా తీసి ఉంటె కచ్చితంగా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి ఉండేది..కానీ ఏమి చేస్తాం పాపం విజయ్ దేవరకొండ బాడ్ లక్.

ప్లస్ పాయింట్స్ :

–> విజయ్ దేవరకొండ
–>కొన్ని డైలాగ్స్
–> అక్కడి పక్కడి , కోక కోక సాంగ్స్

మైనస్ పాయింట్స్ :

–>లవ్ ట్రాక్
–>రమ్య కృష్ణ గారి ఓవర్ యాక్టింగ్
–> దారుణమైన సెకండ్ హాఫ్

చివరి మాట:

పూర్తి జగన్నాథ్ పైత్యాన్ని ఇష్టపడే వారికి తప్ప ఈ సినిమా విజయ్ దేవరకొండ ఫాన్స్ కి కూడా నచ్చదు

రేటింగ్ : 2.25 /5

Read more RELATED
Recommended to you

Latest news