LigerPromise : లైగర్ నుంచి బిగ్ అనౌన్స్ మెంట్

-

అందరూ అనుకున్నట్లు గానే విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కి “లైగర్” అనే పేరు అనౌన్స్ చేశారన్న సంగతి తెలిసిందే. నిజానికి బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఫైటర్ అనే పేరు ఉంటుందని అందరూ భావించారు. కానీ చివరకు లైగర్ పేరునే ఫైనల్ చేశారు. ఇక లైగర్ అంటే పులికి సింహానికి క్రాస్ బ్రీడు.

అంటే మగ సింహానికి ఆడపులికి పుట్టిన బిడ్డను లైగర్ అంటారు. ఈ సినిమాలో విజయ్‌ కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు. పూరీ కనెక్ట్స్ – ధర్మ క్రియేషన్స్ సంయిక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచానాలే ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో సింగర్ షణ్ముఖప్రియ…. ఓ పాటను పడనుంది.

ఈ మేరకు లైగర్ చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు లైగర్ ప్రామిస్ పేరుతో  వీడియోను కూడా విడుదల చేసింది చిత్రబృందం. షణ్ముఖప్రియ కు ఈ సినిమాలో… సాంగ్ పాడే అవకాశం… ఇచ్చినట్లు ఈ వీడియో లో కనిపిస్తుంది. ఇక ఈ వీడియోలో దేవరకొండ మరియు షణ్ముఖప్రియ మధ్య సంభాషణ మనకు కనిపిస్తుంది. ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చినందుకు విజయ్ దేవరకొండ…. షణ్ముఖప్రియ కృతజ్ఞతలు తెలుపుతుంది.ఇక ఈ అప్డేట్ చూశాక.. ఈ సినిమా పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news