హాలీవుడ్ సపోర్ట్ తో మహేశ్ వండర్ వరల్డ్ మూవీ.!

-

ఇప్పుడు దేశంలో నంబర్ వన్ దర్శకుడిగా మన రాజమౌళి ఎదిగిన సంగతి అందరికి తెలిసిందే. బహుబలి సినిమా లతో భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారుమళ్లీ ఆర్ఆర్ఆర్ సినిమాతో రికార్డ్స్ బ్రేక్ చేశారు రాజమౌళి. ఇప్పుడు తన తర్వాత సినిమా పై మనకంటే దేశంలో ఎక్కువుగా ఆసక్తి వుంది. అలాగే రీసెంట్ గా జపాన్ లో ఆర్ఆర్ఆర్ విడుదల చేస్తే  వసూళ్ల లోఇండియా దేశ సినిమాల్లో నంబర్ వన్ గా నిలిచింది.

ఇప్పటికే ఆస్కార్‌ బరిలో నిలిచిన ఈ మూవీ అనేక అవార్డులు సాధిస్తోంది.ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డును గెలుచుకోగా, లాస్ ఏంజెలీస్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డుకు అడుగు దూరంలో ఆగి పోయారు.  ఇక బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎమ్‌ఎమ్‌ కిరవాణి లాస్ ఏంజెలీస్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డును గెలుచుకున్నారు. దీనితో రాజమౌళి ని భారతీయ సినిమా పరిశ్రమ ఐకాన్ గా హలీవుడ్ వాళ్ళు చూస్తున్నారు.ఇక అక్కడి పత్రికలు కూడా రాజమౌళి క్రియేటివ్ డైరెక్టర్ గా కొనియాడు తున్నాయి.

ఇక అక్కడి పెద్ద నిర్మాణ సంస్థలు కొన్ని సినిమా కోసం రాజమౌళితో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడే రాజమౌళి కన్ఫ్యూషన్ లో ఉన్నట్లు గా తెలుస్తోంది .రాజమౌళి తదుపరి సినిమా మహేష్ బాబుతో చేయబోతున్న విషయం తెల్సిందే. దీనినే హాలీవుడ్ లెవెల్ లోకి మార్చాలా లేక ఆర్ ఆర్ ఆర్ మూవీ టైప్ లో ఇండియా లో తీసి ఫారిన్ లో నెక్స్ట్ రిలీజ్ చేయాలా అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మహేశ్ మూవీ కి హలీవుడ్ ప్రొడక్షన్ తోడు అయితే అది మరో వండర్ వరల్డ్ మూవీ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news