గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి… అంటున్న మహేశ్, రామ్ చరణ్..!

మ‌హేష్ హీరోగా న‌టించిన తొలి సినిమా రాజ‌కుమారుడు. ఈ చిత్ర‌ స్ర్కిప్ట్ చెప్పే స‌మ‌యంలో ర‌బ్బ‌రు బ్యాండ్ క‌నిపించ‌డంతో దాంతో ఆడుకున్నాడ‌ట‌.

చిన్న‌నాటి జ్ఞాప‌కాలు ఎవ‌రికైనా ఆనందాన్ని ఉల్లాసాన్నిస్తాయి. అదే స్టార్స్ కి సంబంధించిన ప్ర‌తి చిన్న విష‌యం ప్రేక్ష‌కుల‌కు, అభిమానుల‌కు క్యూరియాసిటీని క‌ల్గిస్తాయి. అలాంటివి విన్న‌ప్పుడు, చూసిన‌ప్పుడు ఓ కొత్త అనుభూతి క‌లుగుతుంది. మ‌హేష్ బాబు, రామ్ చ‌ర‌ణ్‌, వారి ఫ్యాన్స్ ఇప్పుడు అలాంటి అనుభూతి పొందుతున్నారు.

Mahesh babu and Ram charan  shared their childhood memories with their fans

మ‌హేష్ హీరోగా న‌టించిన తొలి సినిమా రాజ‌కుమారుడు. ఈ చిత్ర‌ స్ర్కిప్ట్ చెప్పే స‌మ‌యంలో ర‌బ్బ‌రు బ్యాండ్ క‌నిపించ‌డంతో దాంతో ఆడుకున్నాడ‌ట‌. తొలి సినిమాకి కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ క‌థ‌ని ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ రాశారు. ఈ క‌థ‌ని వాళ్ళు మహేష్‌కి వినిపించ‌డం ప్రారంభించారు. వింటున్న మ‌ధ్య‌లో దూరంగా మ‌హేష్ కి ర‌బ్బ‌ర్ బ్యాండ్ క‌నిపించింది. దాంతో ఆడుకోవ‌డం స్టార్ట్ చేశార‌ట‌. క‌థ చెప్పే ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ఫీల్ అయ్యార‌ట‌. విష‌యం తెలుసుకుని చిత్ర ద‌ర్శ‌కుడు కె.రాఘ‌వేంద్ర రావు వ‌చ్చి మ‌హేష్‌ని గ‌ట్టిగానే మంద‌లించార‌ట‌. క‌థ న‌చ్చ‌క‌పోయినా.. న‌చ్చిన‌ట్టు యాక్ట్ చేయ‌మ‌ని చెప్పిన‌ట్టు తాజాగా ట్విట్ట‌ర్ ద్వారా మ‌హేష్ తెలిపారు.

మ‌హేష్ ప్ర‌స్తుతం మ‌హ‌ర్షిలో న‌టించారు. వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్తుంది. మ‌హేష్ కిది 25వ సినిమా. ఈ నెల 9న సినిమా విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్బంగా ప‌లు త‌న చిన్న‌నాటి జ్ఞాప‌కాల‌ని గుర్తు చేసుకున్నారు. మ‌రోవైపు త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ మ‌ల్టీఫ్లెక్స్ ఏఎంబీ సినిమాస్ గ‌తేడాది డిసెంబ‌ర్‌లో ప్రారంభమైంది. ఇది లాంచ్ అయి దాదాపు ఆరు నెల‌ల‌వుతున్న మ‌హేష్ ఇప్ప‌టి వ‌ర‌కు అందులో సినిమా చూడ‌లేద‌ట‌. తాజాగా ఆదివారం ఫ‌స్ట్ టైమ్ అవెంజ‌ర్స్ః ఎండ్ గేమ్ చూసిన‌ట్టు వెల్ల‌డించారు. మ‌ల్టీఫ్లెక్స్ సిబ్బందితో దిగిన ఓ ఫొటోని పంచుకున్నారు.

మ‌రోవైపు రామ్‌చ‌ర‌ణ్ సైతం త‌న చిన్న‌నాటి జ్ఞాప‌కాల‌ని గుర్తు చేసుకున్నారు. చిన్న‌ప్పుడు తాను చ‌దువుకున్న స్కూల్ కి వెళ్ళి ఆనాటి మ‌ధుర జ్ఞాప‌కాల‌ని రీ క‌లెక్ట్ చేసుకుంటూ అద్భుతానుభూతికి లోన‌య్యారు. చైన్నైలో తాను చ‌దువుకున్న లారెన్స్ ల‌వ్ డేల్‌ని ఇటీవ‌ల సంద‌ర్శించారు. అక్క‌డి లొకేష‌న్లు, హాల్, హాస్ట‌ల్ రూమ్‌, క్యాంటీన్ ఇలా స్కూల్‌కి సంబంధించిన అన్ని ఏరియాలు తిరిగి గుర్తుకొస్తున్నాయి అంటూ ఓ సాంగ్ ఏసుకున్నాడు. అక్క‌డ‌ తాను దిగిన ఫొటోల‌ని సోష‌ల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఇప్పుడీ ఫొటోలు సామాజిక మ‌ద్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

Mahesh babu and Ram charan  shared their childhood memories with their fans

Mahesh babu and Ram charan  shared their childhood memories with their fans

Mahesh babu and Ram charan  shared their childhood memories with their fans

Mahesh babu and Ram charan  shared their childhood memories with their fans

Mahesh babu and Ram charan  shared their childhood memories with their fans