సూపర్ స్టార్‌ మహేశ్ బాబుకి థ్యాంక్యూ చెప్పిన విజయశాంతి..!

-

లేడీ అమితాబ్‌ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు విజ‌య‌శాంతి. ఆమె సినిమాలు స్టార్‌ హీరోలతో సమానంగా బాక్సాపీస్‌ వద్ద పోటీ పడేవి అంటే..విజయశాంతి స్టార్‌ డమ్‌ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌తోపాటు ఫాలోవర్లను సంపాదించుకున్న విజయశాంతి పుట్టినరోజు నేడు..

ఈ సందర్భంగా సినీ నటుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆమెకు పుట్టినరోజు విషెస్ తెలిపారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు విజయశాంతి గారు. మీరు ఎల్లప్పుడు పూర్తి ఆరోగ్యంతో, సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను’ అని మహేశ్ ట్వీట్ చేశారు. దీనికి ఆమె ‘థ్యాంక్యూ సూపర్ స్టార్ మహేశ్ బాబు గారు’ అంటూ రిప్లై ఇచ్చారు. ఒకప్పుడు విజయశాంతి, కృష్ణ సినిమాలో మహేశ్‌ బాబు బాలనటుడిగా అలరించిన విషయం తెలిసిందే. మళ్లీ సుదీర్ఘవిరామం తరువాత సరిలేరు నీకెవ్వరు చిత్రంతో సిల్వర్‌స్క్రీన్‌పై మెరిశారు.

Read more RELATED
Recommended to you

Latest news