తల్లి అంత్యక్రియలు పూర్తి చేసిన మహేష్ బాబు.. ఫోటో వైరల్..!!

-

వరుసగా పలువురు ప్రముఖుల మరణాలు సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒకరి మరణం మరవకముందే మరొకరు మరణం మరింతగా బాధపెడుతోంది. ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ హీరో కృష్ణంరాజు మరణం సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇంకా ఈ సంఘటనను మర్చిపోకముందే సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి కృష్ణ సతీమణి ఇందిరా దేవి కన్నుమూశారు. ఇక ఈమె మరణం సినీ ఇండస్ట్రీని మరొకసారి శోకసంద్రంలో ముంచేసిందని చెప్పవచ్చు. ఇక ఈమె మరణానికి సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు పలువురు అభిమానులు కూడా సంతాపం తెలియజేశారు.

- Advertisement -

ఇక కృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల క్రితం అనారోగ్య సమస్యతో బాధపడిన ఇందిరాదేవి ఏఐజ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చివరి నాలుగు రోజుల క్రితం ఇంటికి చేరుకున్నారు. ఇక వైద్యులు కూడా ఈమె బ్రతకడం కష్టమే అని చెప్పడంతో కుటుంబ సభ్యులంతా నాలుగు రోజులపాటు ఇందిరా దేవితోనే గడిపారు.

కానీ దేవుడు మాత్రం ఆమెను కనికరించలేదు. ఎట్టకేలకు బుధవారం ఉదయం ఇందిరా దేవి తుది శ్వాస విడిచారు. ఇక ఈమె పార్తివదేహాన్ని సందర్శనార్థం అన్నపూర్ణ స్టూడియోస్ కి తరలించారు కానీ ఎక్కడ కూడా మీడియాకు అనుమతి ఇవ్వలేదు.

అన్నపూర్ణ స్టూడియో ప్రాంగణంలో ఇందిరాదేవి అంత్యక్రియలు జరిగినట్లు సమాచారం . అందుకు సంబంధించిన ఫోటో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మహేష్ బాబు తన తల్లి మృతదేహానికి దహన సంస్కారాలు పూర్తి చేశారు.

ఇదిలా ఉండగా ఇందిరా దేవి మనవరాలు సితార ఆవేదన ను మాత్రం ఎవరు తీర్చలేక పోతున్నారు.. నానమ్మ లేరు అనే విషయాన్ని తెలుసుకున్న ఆ పాప కన్నీటి పర్యంతం అవుతుంది . ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా బాగా వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...