మహేష్ కూడా వాటిపై పడ్డాడు

-

సూపర్ స్టార్ మహేష్ సినిమా బడ్జెట్ కంట్రోలింగ్ ప్రాసెస్ లో తన సొంతంగా ఎం.బి ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ స్థాపించి చేసే సినిమాలకు రెమ్యునరేషన్ తీసుకోకుండా ఏరియా రైట్స్ తీసుకోవడం కొన్ని సినిమాలకు జరిగింది. మహేష్ వైఫ్ నమ్రత ఈ విషయాలను చూసుకున్నారు. మహేష్ ఎంబి ప్రొడక్షన్స్ లో రెండు మూడు సినిమాలు ఇలా భాగమయ్యాయి. కాని తర్వాత ఎంబి ప్రొడక్షన్స్ కనిపించలేదు.

లేటెస్ట్ గా ఎంబి ప్రొడక్షన్స్ లో వెబ్ సీరీస్ తీసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. యువత టాలెంట్ చూపించేందుకు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సీరీస్ ల మీద బాగా దృష్టి పెడుతున్నారు. అలాంటి వాటికి ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకే వెబ్ సీరీస్ లైతే బాగా వర్క్ అవుట్ అవుతుందని మహేష్ కూడా వెబ్ సీరీస్ ప్రొడ్యూస్ చేయాలని చూస్తున్నాడట. ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా కథలు అందిస్తున్న ఈ వెబ్ సీరీస్ లు కొత్త టాలెంట్ ను ఎంకరేట్ చేసేలా ఉంటాయని తెలుస్తుంది. మరి వీటికి సంబందించిన ఆడిషన్స్ చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news