Big Boss OTT Telugu:‘బిగ్ బాస్’ టైటిల్ విన్నింగ్ చాన్సెస్ వాళ్లకే..మహేశ్ విట్టా కామెంట్స్

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఆరో సీజన్ ‘ఓటీటీ’ వర్షన్ గా కొనసాగుతోంది. 17 మంది కంటెస్టెంట్స్ తో స్టార్ట్ అయిన ఈ గేమ్ ..ఏడో వారంలో 11 మంది వరకు వచ్చింది. కాగా, ఏడో వారం హౌజ్ నుంచి మహేశ్ విట్టా ఎలిమినేట్ అయ్యాడు. ఈ క్రమంలోనే ‘బిగ్ బాస్’ బాబా మాస్టర్ ను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్ కు పంపాడు.

ఇకపోతే ఇంటి నుంచి బయటకు వచ్చిన మహేశ్ విట్టా.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్..టైటిల్ విన్నింగ్ చాన్సెస్ గురించి మాట్లాడాడు. తాను బయటకు వచ్చినా ఎటువంటి బాధ లేదని, తమకు ‘బిగ్ బాస్’ షో స్టార్ట్ అయ్యే టైంలోనే ఎప్పుడైనా ఎలిమినేట్ చేయొచ్చని చెప్పారని వివరించాడు. అలా తాను బయటకు వచ్చినా ఎటువంటి ఇబ్బందేమీ లేదని ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేశ్ విట్టా పేర్కొన్నాడు.

హౌజ్ నుంచి బయటకు వచ్చినప్పటికీ తనకు ఎటువంటి బాధ లేదని, తనకు బయట లక్షా తొంభై పనులు ఉన్నాయని హౌజ్ లో ఎలిమినేట్ అని తెలిసినప్పుడే మహేశ్ విట్టా చెప్పాడు. ఈక్రమంలోనే ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్స్ అనిల్, అషురెడ్డి గురించి మాట్లాడాడు. హౌజ్ లో ఉన్న వారిలో ‘పుష్పం’ అనిల్ అని అన్న మహేశ్ విట్టా..తర్వాత పుష్పం ‘అషురెడ్డి’ అని అన్నాడు.

ఇప్పుడున్న వారిలో బిగ్ బాస్ టైటిల్ విన్నింగ్ చాన్సెస్ బిందు మాధవి, అఖిల్, శివకు ఉన్నాయని అన్నాడు. అరియానాకు కూడా విన్నింగ్ చాన్సెస్ ఉండొచ్చని అన్నాడు. ఇకపోతే మిత్రా శర్మ గేమ్ గురించి మాట్లాడుతూ గేమ్ విషయంలో మిత్రా శర్మ చాలా కాన్ఫిడెంట్ గా ఉందని చెప్పాడు. తను ఒక 20 రోజులు పాటు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్లీ సినిమాల్లో తన ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీ అవుతానని వివరించాడు మహేశ్ విట్టా.

 

Read more RELATED
Recommended to you

Latest news