మీడియాపై మంచి బౌన్సర్లు దాడి.. మద్యం మత్తులో..?

-

జల్ పల్లి మోహన్ బాబు నివాసం వద్ద హైడ్రామా సాగుతుంది. మరికాసేపట్లో జల్ పల్లి నివాసానికి చేరుకోనున్నారు మంచు విష్ణు. మంచు విష్ణు రానుండటంతో జల్ పల్లి నివాసం వద్ద బౌన్సర్లను ఏర్పరు చేసారు. అందుకు పోటీగా బౌన్సర్లను రప్పించారు మంచు మనోజ్. ఆళ్లగడ్డ నుండి మంచు మనోజ్ కు మద్దతుగా వచ్చారు మరికొందరు అభిమానులు. మోహన్ బాబు నివాసం వద్దకు లేడీ బౌన్సర్లు కూడా చేరుకున్నారు.

అయితే ఈ వార్తను కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులపై బౌన్సర్లు దాడి చేసినట్లు తెలుస్తుంది. శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీలో బౌన్సర్ల దౌర్జన్యం చేస్తున్నారు. అయితే బౌన్సర్లు తమపై దాడి చేశారని ఇద్దరు మీడియా ప్రతినిధులు ఆరోపించారు. ముఖ్యంగా వారు మద్యం సేవించారు అని.. ఆ మద్యం మత్తులో రాళ్లు, కర్రలతో 30 మంది దాడి చేశారని చెబుతున్నారు మీడియా ప్రతినిధులు. అయితే ఈ మంచు ఫ్యామిలీలో వివాదానికి కేంద్ర బిందువుగా మారాడు వినయ్ అనే వ్యక్తి. విద్యానికేతన్ విద్యాసంస్థల్లోనే కీలకంగా ఉన్నాడు వినయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version