మంచులక్ష్మీ ‘శివరాత్రి స్పెషల్’ సాంగ్.. అదిరిపోయిన విజువల్స్

-

మంచు లక్ష్మీ.. మోహన్‌బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటిగా, నిర్మాతగా, హోస్టుగా ఇలా అన్ని విభాగాల్లో తన సత్తా చూపిస్తున్న లక్ష్మీ తాజాగా సింగింగ్ లోనూ తానేం తక్కువ కాదని నిరూపించింది. మహా శివరాత్రి సందర్భంగా మంచులక్ష్మీ ఓ స్పెషల్ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది.

ఆది శంకరాచార్యులు రచించిన ‘నిర్వాణ శతకం’ శ్లోకాన్ని మంచు లక్ష్మి తన కుమార్తె విద్యా నిర్వాణతో కలిసి ఆలపించింది. వారణాసిలోని పవిత్ర ఘాట్‌ల దగ్గర ఈ పాటను చిత్రీకరించారు. వివిధ రకాల వేషధారణలో మంచులక్ష్మీ ఈ సాంగ్‌లో కనిపించింది. కన్నూ సమీర్‌ స్వరపరిచిన ఈ పాటలో  ఇంగ్లీష్‌ సాహిత్యం కూడా ఉంది.  విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. వారణాసిని కళ్లకు కట్టినట్లు చూపించాడు. లేటెస్ట్‌గా రిలీజైన ఈ పాటపై మీరూ ఓ లుక్కేయండి.

Read more RELATED
Recommended to you

Latest news